IND vs WI 2nd T20: రెండో టీ20లో టీమ్ఇండియా విజయం సాధించింది. కోల్‌కతాలో వెస్టిండీస్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో గెలిచిన భారత్.. సిరీస్‌ను సొంతం చేసుకుంది.
అంతకు ముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా.. 186/5 స్కోరు చేసింది. కోహ్లీ, పంత్.. హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. విండీస్ బౌలర్లలో ఛేజ్ 3 వికెట్లు, షెపర్డ్, హోసేన్ తలో వికెట్ తీశారు.