IND vs WI 2nd T20: విండీస్ రెండో టీ20లో టీమ్ఇండియా బ్యాట్స్‌మెన్ చెలరేగారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. గత కొంతకాలంగా బ్యాటింగ్‌లో తడపడుతున్న విరాట్ కోహ్లీ.. ఈ మ్యాచ్‌తో ఫామ్‌లోకి వచ్చాడు. 41 బంతుల్లో 52 పరుగులు చేసి జట్టు స్కోరులో కీలక పాత్ర పోషించాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు ఒక సిక్సర్ బాదాడు. కానీ రోస్టన్ ఛేజ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
ఆ తర్వాత రిషబ్ పంత్, వెంకటేశ్ అయ్యర్లు చివరి ఓవర్లలో దూకుడుగా ఆడి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఏడు ఫోర్లు ఓ సిక్సర్ బాదిన పంత్ 28 బంతుల్లో 52 పరుగులు చేశాడు. మరోవైపు అయ్యర్ 18 బంతుల్లో 33 పరుగులు చేశాడు.