IND VS WI first test 2023 : అనుకున్నట్టే జరిగింది. మొదటి టెస్టులో తొలి రోజు వెస్టిండీస్ ఏ మాత్రం పోరాడలేకపోయింది. యంగ్ ప్లేయర్ అలిక్ అథనేజ్ (47)ను మినహా మిగిలిన ఆటగాళ్లు చేతులెత్తేశారు. అతడు హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నప్పటికీ.. బ్యాటింగ్ అద్భుతం చేశాడు. అతడి ఆటతీరు భవిష్యత్త్‌లో కీలక ఆటగాడిగా ఎదుగుతాడనే నమ్మకాన్ని కలిగించింది.
బ్యాటింగ్ ఇలా..
- భారత్ బౌలింగ్ పటిష్ఠంగా ఉందని తెలిసినప్పటికీ.. విండీస్ బ్యాటర్లు సహనం ప్రదర్శించలేకపోయారు.
- అశ్విన్ దెబ్బకు బాగా రాణస్తాడనుకున్న యంగ్ బ్యాటర్ త్యాగ్‌నారాయణ్ (12) బౌల్డ్ అయ్యాడు.
- ఇక నిలకడగా ఆడుతూ జట్టును కాపాడాల్సింది పోయి.. చెత్త షాట్ ఆడి ఔట్ అయ్యాడు కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ (20). జట్టులో అతడొక్కడే సీనియర్ కూడా. బాధ్యతారహితంగా ఆడాడు.
- బ్లాక్‌వుడ్, జాసన్ హోల్డర్ కాసేపు భారత బౌలర్లకు విసిగించినా.. కీలక సమయంలో చేతులెత్తేశారు. ఒక్క అలిక్ అథనేజ్ కాస్త రాణించడం వల్లే.. 150 స్కోరు చేసింది.
బౌలింగ్ తుస్సు..
- భారత బౌలర్లు ఎంత బాగా రాణించారో అదే పిచ్‌పై విండీస్ బౌలర్లు చేతులెత్తేశారు. మ్యాచ్ ముందుకు సాగే కొద్దీ పిచ్.. స్పిన్‌కు అనుకూలంగా మారిందని అశ్విన్ చెప్పాడు కూడా. మరి అలాంటి పిచ్‌పై విండీస్ స్పిన్నర్లు కార్న్‌వాల్, వారికాన్ ప్రభావం చూపలేకపోయారు. భారత ఓపెనర్లు యశస్వి, రోహిత్ శర్మ నిలకడగా పరుగులు సాధించారు.
- విండీస్ పేసర్లు కీమర్ రోచ్, జాసన్ హోల్డర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినప్పటికీ.. వికెట్ తీయలేకపోయారు.
- ఇక అల్జారీ జోసెఫ్.. ఐదు ఓవర్లోనే 25 పరుగులు సమర్పించుకున్నాడు. అలా విండీస్ బౌలర్లు.. భారత ఓపెనర్లను కట్టడి చేయలేకపోయారు. దీంతో తొలి రోజు ఆట పూర్తయ్యేసరికి భారత్ వికెట్ కోల్పోకుండా ఆడింది. క్రీజులో రోహిత్, యశస్వి ఉన్నారు.