ind vs wi 2023 second test: విండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమ్ఇండియా మంచి దూకుడుగా ఆడుతోంది. ప్రత్యర్థి జట్టు ముందు 365 భారీ లక్ష్యాన్ని ఉంచింది. నాలుగు రోజులు ఆట ముగిసేసరికి.. విండీస్ జట్టు 76/2 స్కోరుతో క్రీడులో నిలిచింది. ఓ సారి ఈ మ్యాచ్‌లో ఇప్పటివరకు నమోదైన రికార్డులను చూద్దాం..
- ishan kishan strike rate vs Wi : వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ఓ ఘనత అందుకున్నాడు. ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేసిన మూడో వికెట్ కీపర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో 152.94 స్ట్రైక్‌రేట్‌తో 34 బంతుల్లోనే 52 పరుగులను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతకుముందు ఆసీస్ మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ 172.88 స్ట్రైక్‌రేట్‌తో 59 బంతుల్లో 102 అజేయ పరుగులు సాధించాడు. రిషభ్ పంత్ 161.29 స్ట్రైక్‌రేట్‌తో 31 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదాడు.
- ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా తరఫున అత్యధిక స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేసిన బ్యాటర్ల లిస్ట్‌లో చేరాడు ఇషాన్ కిషన్. 152.94 స్ట్రైక్ రేట్‌తో ఆడిన ఇతడు.. ఇప్పుడు ఈ జాబితాలో నాలుగో బ్యాటర్‌గా నిలిచాడు. కనీసం యాభైకుపైగా పరుగులు చేసిన జాబితాలో కపిల్ దేవ్ 161.81 స్టైక్‌రేట్‌తో అందరికన్నా ముందున్నాడు. ఆ తర్వాత రిషభ్ పంత్ 161.29 స్ట్రైక్ రేట్‌తో కొనసాగుతుండగా, శార్దూల్ ఠాకూర్ 158.33 స్ట్రైక్‌రేట్‌తో ఉన్నాడు.
- ఇకపోతే కనీసం 20 ఓవర్లు ఆడిన ఓ ఇన్నింగ్స్‌లో.. అత్యధిక రన్‌రేట్‌తో పరుగులు సాధించిన ఫస్ట్ టీమ్‌గా టీమ్ఇండియా నిలిచింది. వెస్టిండీస్‌పై సెంకడ్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 24 ఓవర్లలో 7.54 రన్‌రేట్‌తో 181/2 స్కోరు చేసింది. ఇప్పటి వరకు ఈ లిస్ట్‌లో పాకిస్థాన్‌పై అస్ట్రేలియా జట్టు సాధించిన ఘనత ఉంది. ఆసీస్ టీమ్.. 7.53 రన్‌రేట్‌తో ఓ ఇన్నింగ్స్ ఆడింది.
- ashwin vs west indies ఇంటర్నేషనల్ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన సెకండ్ టీమ్ఇండియా బౌలర్‌గా రవిచంద్రన్ అశ్విన్ మార్క్‌ను అందుకున్నాడు. వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో ఇప్పటి వరకు రెండు దక్కించుకున్న అశ్విన్.. అన్ని ఫార్మాట్లలో కలిపి మొత్తంగా 712 వికెట్లను తీశాడు. ఈ లిస్ట్‌లో అనిల్ కుంబ్లేదే 956 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక అశ్విన్ కారణంగా హర్భజన్‌సింగ్ (711) మూడో స్థానానికి పడిపోవాల్సి వచ్చింది.
- వెస్టిండీస్‌పై అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్‌గా అశ్విన్ నిలిచాడు. ఇప్పటి వరకు వెస్టిండీస్‌పై 75 వికెట్లు తీసిన అతడు .. 74 వికెట్లతో ఉన్న దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లేను అధిగమించాడు. అయితే ఈ జాబితాలో కపిల్‌దేవ్ అందరికన్నా ముందున్నాడు. అతడు తన టెస్టు కెరీర్‌లో వెస్టిండీస్‌పై 89 వికెట్లు తీశాడు.
ఇదీ చూడండి :