IND VS WIind vs wi 1st T20 2023 : ఇప్పటి వరకు టీమ్ఇండియా - వెస్టిండీస్ జట్ల మధ్య 25 టీ20 మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో భారత జట్టు 17 మ్యాచుల్లో గెలవగా.. 7 మ్యాచుల్లో ఓడింది. ఒక మ్యాచ్‌లో రిజల్ట్ రాలేదు. వెస్టిండీస్ గడ్డపైనా టీమ్ఇండియాదే ఆధిక్యం. అక్కడ నాలుగు మ్యాచుల్లో భారత జట్టు విజయాన్ని అందుకోగా.. ప్రత్యర్థి జట్టు కేవలం రెండిటిలోనే గెలిచింది. తటస్థ వేదికల్లో ఐదు మ్యాచుల్లో భారత్ విజయాన్ని సాధించగా.. విండీస్ రెండు మ్యాచుల్లోనే గెలుపొందింది.
ఎక్కువ-తక్కువ రెండూ విండీస్‌దే.. గత ఆరు టీ20ల్లో టీమ్ఇండియా ఐదింటిలో గెలుపొందింది. ఒక్క మ్యాచులో మాత్రం ఓటమిని అందుకుంది. అయితే ఒక మ్యాచ్‌లో మాత్రం విండీస్ భారీ స్కోరు చేసింది. 2016లో టీమ్ఇండియాపై వెస్టిండీస్ జట్టు 245/6 స్కోరు చేయడం గమనార్హం. అలానే అత్యల్ప స్కోరు కూడా వెస్టిండీస్ పేరు మీదనే ఉంది. 2019లో జరిగిన ఓ మ్యాచ్‌లో మాత్రం 95 పరుగులకే ఆలౌట్ అయింది.
- భారత్‌పై వెస్టిండీస్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు 125 పరుగులు. ఎవిన్ లూయిస్ దీన్ని సాధించాడు. టీమ్ఇండియాపై అతడు రెండు శతకాలు బాదాడు.
- కేఎల్ రాహుల్ - రోహిత్ శర్మ కలిసి 2019లో 135 పరుగుల అత్యధిక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
- ఓబెద్ మెకాయ్ 6/17 అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేశాడు.
- భారత బౌలర్ భువనేశ్వర్ కుమార్ 18 ఇన్నింగ్స్‌ల్లో 13 వికెట్లు తీశాడు. విండీస్‌పై ఓ భారత ప్లేయర్ తీసిన అత్యధిక వికెట్లు ఇవే.
- టీమ్‌ఇండియా బ్యాటర్ విరాట్ కోహ్లీ 6 అర్ధశతకాలు నమోదు చేశాడు. విండీస్‌పై ఓ భారత ప్లేయర్ అత్యధికంగా చేసిన హాఫ్ సెంచరీలు.
- భారత కెప్టెన్ రోహిత్ శర్మ వెస్టిండీస్‌పై అత్యధికంగా 39 సిక్స్‌లు, 57 ఫోర్లు కొట్టాడు.
ind vs wi 1st t20 pitch report : మూడో వన్డే జరిగిన ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా స్టేడియంలోనే మొదటి టీ20 మ్యాచ్ కూడా జరగనుంది. ఇది బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండొచ్చు. చివరి వన్డేలో భారత్ ఏకంగా 351 పరుగులు చేసింది. ఈ సారి కూడా టాస్ కీలకంగా మారే ఛాన్స్ ఉంటుంది. టాస్ గెలిచే జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకునే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ఈ మ్యాచ్ సమయంలో చిన్నపాటి వర్షం పడే అవకాశం ఉందట.