తెలంగాణ

telangana

ETV Bharat / sports

IND vs WI 2022: ఇషాన్​కు సూపర్​ ఛాన్స్​.. ​రోహిత్​తో ఓపెనింగ్ - భారత్​-విండీస్​ వన్డే

IND vs WI 2022: విండీస్​తో తొలి వన్డే​కు సంబంధించిన వివరాలు వెల్లడించాడు కెప్టెన్ రోహిత్ శర్మ. ధావన్​కు కరోనా సోకిన కారణంగా ఆ స్థానంలో యువ క్రికెటర్​ ఇషాన్​ కిషన్​ తనతో కలిసి ఓపెనింగ్​ చేస్తాడని తెలిపాడు.

IND vs WI 2022
రోహిత్​ శర్మ

By

Published : Feb 5, 2022, 3:22 PM IST

Updated : Feb 5, 2022, 4:37 PM IST

IND vs WI 2022: విరాట్​ కోహ్లీ నుంచి పరిమిత ఓవర్ల క్రికెట్​కు కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న తర్వాత మొదటిసారిగా రోహిత్​ శర్మ మీడియాతో సమావేశమయ్యాడు. విండీస్​తో ఆదివారం జరిగే తొలి వన్డేకు సంబంధించి జట్టు కూర్పుపై వివరాలు వెల్లడించాడు. శిఖర్​ ధావన్​ కరోనా బారిన పడిన నేపథ్యంలో అతడి స్థానంలో యువక్రికెటర్​ ఇషాన్​ కిషన్​ ఓపెనింగ్​కు దిగుతున్నట్లు తెలిపాడు. మయాంక్​కు ఇంకా క్వారంటైన్​ వ్యవధి పూర్తికాని నేపథ్యంలో ఓపెనర్ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఇషాన్​ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదన్నాడు.

ఇషాన్​ కిషన్​

"విరాట్​ కెప్టెన్​గా ఉన్నప్పుడు నేను వైస్​కెప్టెన్​గా ఉన్నాను. ఇప్పుడు నేను ఆ బాధ్యతలు అందుకున్నాను. జట్టు నుంచి ఏం ఆశిస్తారో మాకు తెలుసు. విరాట్​ వదిలేసిన పగ్గాలను అందుకుని జట్టును ముందుకు నడిపించడమే నా బాధ్యత. అంతకుమించి ఎలాంటి మార్పులు చేయదలచుకోలేదు. ప్రస్తుతం నా దృష్టి విండీస్​తో వన్డే, టీ20లకు టీమ్​ఇండియా తరపున సారథ్యం వహించడమే. టెస్టు కెప్టెన్సీపై నాకు ఎలాంటి ఆలోచనా లేదు."

-రోహిత్​ శర్మ, టీమ్​ఇండియా కెప్టెన్​

వాళ్లు వన్డేల్లో లేనట్టే..

కరోనా బారిన పడిన కీలక ఆటగాళ్లు శిఖర్​ ధావన్​, రుతురాజ్​ గైక్వాడ్​, శ్రేయస్​ అయ్యర్​లు వన్డే సిరీస్​కు దూరమయ్యే అవకాశం ఉందన్నాడు రోహిత్. ఐసొలేషన్​లో ఉన్న ఆ ముగ్గురూ కోలుకుంటున్నారని కానీ చివరిక్షణం వరకు ఏమీ చెప్పలేమని పేర్కొన్నాడు.

అందరూ సిద్ధంగా ఉండాలి..

రిజర్వ్​ ఆటగాళ్లు కూడా జట్టులో ఆడేందుకు సిద్ధంగా ఉండాలని రోహిత్​ సూచించాడు. "కొవిడ్​ వల్ల పరిస్థితులు మారొచ్చు. ఎప్పుడు ఎవరికి అవకాశం వస్తుందో తెలియదు. కాబట్టి దీనిని దృష్టిలో ఉంచుకుని వాళ్లు సన్నద్ధం కావాలి. ఈ విషయంపై ఆటగాళ్లకు ఇదివరకే స్పష్టం చేశాను." అని రోహిత్​ శర్మ పేర్కొన్నాడు.

ఇదీ చూడండి :భారత సంతతి కుర్రాడు అదరహో.. అఫ్గాన్​పై ఆసీస్​ విజయం

Last Updated : Feb 5, 2022, 4:37 PM IST

ABOUT THE AUTHOR

...view details