తెలంగాణ

telangana

ETV Bharat / sports

ద్రవిడ్​ ఓ అద్భుతం.. యువ క్రికెటర్ల ప్రశంసలు - ద్రవిడ్​పై యువ క్రికెటర్లు ప్రశంసలు

తమకు కోచ్​గా వ్యవహరిస్తున్న రాహుల్​ ద్రవిడ్(Rahul Dravid)​ నుంచి ఎన్నో గొప్ప విషయాలను నేర్చుకుంటున్నట్లు తెలిపారు లంక పర్యటనలో(Srilanka Tour) ఉన్న యువ క్రికెటర్లు. ఆయన ఉన్నత వ్యక్తిత్వం కలవాడని ప్రశంసించారు.

dravid
ద్రవిడ్​

By

Published : Jul 15, 2021, 4:52 PM IST

రాహుల్​ ద్రవిడ్​(Rahul Dravid)పై ప్రశంసల జల్లు కురిపించారు శ్రీలంక పర్యటనలో(Srilanka Tour) ఉన్న యువ క్రికెటర్లు. ఆయన నుంచి క్రికెట్​ నైపుణ్యాలను నేర్చుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ధావన్​ నేతృత్వంలో టీమ్​ఇండియా ప్రస్తుతం లంక పర్యటనలో ఉంది. ఈ సిరీస్​కు కోచ్​గా వ్యవహరిస్తున్నాడు ద్రవిడ్​. ఈ నేపథ్యంలో ఆయనపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు సంజు శాంసన్​, చేతన్ సకారియా, కృష్ణప్ప గౌతమ్, నితీశ్​ రానా, దేవదత్​ పడిక్కల్​.

"ద్రవిడ్​ ఆధ్వర్యంలో భారత్-ఏ జట్టు నుంచి టీమ్​ఇండియాకు వెళ్లే ప్రతి క్రికెటర్ అదృష్టవంతుడు. ఆయన నుంచి క్రికెట్​ నైపుణ్యాలను నేర్చుకోవడం ఎంతో అదృష్టం. రాజస్థాన్​ రాయల్స్​ జట్టులో శిక్షణ తీసుకున్నప్పుడు ఓ రోజు నేను బ్యాటింగ్​ బాగా చేశా. అప్పుడు ఆయన వచ్చి నా జట్టు కోసం ఆడతావా? అని అడిగారు. అది నా జీవితంలో మర్చిపోలేని అతిపెద్ద అందమైన అనుభూతి. ద్రవిడ్​ గొప్ప వ్యక్తి అని చెప్పడానికి ఇదే నిదర్శనం. ఆయన కంపెనీని బాగా ఎంజాయ్​ చేస్తా."

-సంజు శాంసన్​(Sanju Samson).

"క్రికెట్​లో ఎంతో ఎత్తుకు ఎదిగినప్పటికీ ఒదిగి ఉండే వ్యక్తిత్వం కలవారు ద్రవిడ్. జాలి, దయ, వినయం వంటి గుణాలున్న వ్యక్తి. మాకు మార్గనిర్దేశకుడు. శ్రీలంక పర్యటనలో ఆయన నుంచి ఎన్నో విషయాలను నేర్చుకుంటున్నా."

-దేవదత్​ పడిక్కల్(Devadutt padikkal).​

"ద్రవిడ్​లా సహనంగా ఎలా ఉండాలో నేర్చుకుంటున్నా. ఆయనకు ఉన్న సహనంలో ఒక్క శాతంనైనా నేను అలవరచుకోవాలనేది నా కోరిక. అదే నాకు పెద్ద విజయం."

-నితీశ్​ రానా(Nitish Rana).

"ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్​ జట్లు ఆధిపత్య క్రికెట్​ ఆడినప్పుడు వారిని ద్రవిడ్ ఎలా ఎదుర్కొన్నాడు, ఎలా ఇబ్బంది పెట్టాడు వంటి విషయాలను నేర్చుకోవాలనుకుంటున్నా. ఆయన ఆలోచనా విధానాన్ని పసిగట్టడం సహా గొప్పగా ఆడాలని ప్రయత్నిస్తున్నా."

-సకారియా(Sakariya).

" భారత్‌-ఏకు ఆడేటప్పుడు ద్రవిడ్​ కోచ్‌గా ఉన్నారు. ఎలాంటి సందేహం కలిగినా నేరుగా వెళ్లి అడిగేవాడిని. ఎన్‌సీఏలోనూ ఆయనతో చాలా సమయం గడిపా. ఆయనతో కలిసి మళ్లీ పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉంది. టీమ్‌ఇండియాతో నా ప్రయాణం గురించి ఆయనను అడుగుతా. సుదీర్ఘ కాలం, భారీ మ్యాచులు ఆడేందుకు ఒక క్రికెటర్‌ ఏం చేయాలో ఆయన్నుంచి తెలుసుకుంటా. అన్ని ప్రశ్నలకూ ఆయన సమాధానం చెప్పగలరు."

-కృష్ణప్ప గౌతమ్‌(Krishnappa Gowtham)

ఇదీ చూడండి: 'టీమ్​ ఇండియా నెక్స్ట్​ కోచ్​గా అతడే బెస్ట్​'!

ABOUT THE AUTHOR

...view details