లంకతో జరుగుతున్న మూడో టీ20లో స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ మరోసారి విధ్వంసాన్ని సృష్టించాడు. బ్యాట్‌తో చెలరేగిపోయాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచి ఫోర్లు, సిక్సర్లతో ప్రత్యర్థి జట్టుపై విరుచుకుపడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. మైదానం నలుమూలల షాట్లు ఆడుతూ అభిమానులను అలరించాడు. మొత్తంగా 51 బంతుల్లో 112 రన్స్ చేసి సెంచరీతో మెరిశాడు. దీంతో అతడు టీ20ల్లో మూడో శతకం నమోదు చేశాడు. టీమ్ఇండియా తరఫున వేగవంతమైన టీ20 సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. అంతకుముందు రోహిత్ శర్మ మొదటి స్థానంలో ఉన్నాడు. 2017 శ్రీలంకపై రోహిత్ 35 బంతుల్లోనే శతకం బాదాడు.
IND VS SL: సూర్యకుమార్ మెరుపు సెంచరీ.. గ్రౌండ్లో సిక్సర్ల సునామీ.. లంక లక్ష్యం ఎంతంటే? - శ్రీలంకపై టీమ్ఇండియాదే సిరీస్
లంకతో జరుగుతున్న మూడో టీ20లో టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అదరగొట్టేశాడు. సెంచరీతో మెరిశాడు. దీంతో భారత జట్టు.. ప్రత్యర్థి టీమ్‌కు 229 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
![IND VS SL: సూర్యకుమార్ మెరుపు సెంచరీ.. గ్రౌండ్లో సిక్సర్ల సునామీ.. లంక లక్ష్యం ఎంతంటే? IND VS SL third T20 teamindia innings](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17424481-thumbnail-3x2-suryaa.jpg)
IND VS SL: సూర్యకుమార్ జోరు.. లంక లక్ష్యం ఎంతంటే?
ఇకపోతే ఈ ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ (48), రాహుల్ త్రిపాఠి(3)5 రాణించారు. దీపక్ హుడా (4), ఇషాన్ కిషన్ (1) విఫలం అయ్యారు. మొత్తంగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసింది. లంక బౌలర్లలో మదుశంక(2), రజితా, కరుణరత్నె, హసరంగ తలో వికెట్ తీశారు.
ఇదీ చూడండి:బీసీసీఐ కొత్త సెలక్షన్ కమిటీ ప్రకటన.. ఛైర్మన్ ఎవరంటే?
Last Updated : Jan 7, 2023, 10:47 PM IST