తెలంగాణ

telangana

ETV Bharat / sports

Rohit Sharma: 'పుజారా, రహానె స్థానాలను అతడు భర్తీ చేస్తాడు!' - రవీంద్ర జడేజా

Rohit Sharma: శ్రేయస్​ అయ్యర్​.. టెస్టు స్పెష్టలిస్టులు పుజారా, రహానె స్థానాలకు పోటీనిస్తున్నాడని అన్నాడు భారత సారథి రోహిత్​ శర్మ. ప్రేక్షకులు మళ్లీ స్టేడియాల్లోకి రావడం ఉత్సాహం కలిగిస్తోందన్నాడు. శ్రీలంకతో రెండో టెస్టు విజయం తర్వాత రోహిత్​ మీడియాతో మాట్లాడాడు.

Rohit sharma
రోహిత్​ శర్మ

By

Published : Mar 14, 2022, 11:15 PM IST

Rohit Sharma: శ్రేయస్​ అయ్యర్​పై ప్రశంసల వర్షం కురింపించాడు టీమ్​ఇండియా కెప్టెన్ రోహిత్​శర్మ. టెస్టు స్పెష్టలిస్టులు పుజారా, రహానె స్థానాలకు అయ్యర్​ పోటీనిస్తున్నాడని అన్నాడు. రవీంద్ర జడేజా, రిషబ్​ పంత్​.. రోజురోజుకు మెరుగవుతున్నారని అన్నాడు. శ్రీలంకతో రెండో టెస్టులో గెలిచిన అనంతరం ​మీడియాతో మాట్లాడిన సందర్భంగా రోహిత్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

శ్రేయస్​ తన అత్యుత్తమ ఫామ్‌ కొనసాగిస్తున్నాడు. టీ20 సిరీస్‌లో రాణించినట్లే.. టెస్టుల్లోనూ కీలక ఇన్నింగ్స్​ ఆడాడు. టెస్టు స్పెష్టలిస్టులు పుజారా, రహానె స్థానాలను అతడు భర్తీ చేసే విధంగా కనబడుతున్నాడు. రిషబ్ పంత్‌ కూడా సుదీర్ఘ ఫార్మాట్లో పరిణతి సాధిస్తున్నాడు. ఆడిన ప్రతి మ్యాచులోనూ మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నిస్తున్నాడు. జడేజా కూడా గొప్పగా ఆడాడు. జట్టు విజయాల్లో కీలకంగా మారుతున్నాడు.

-రోహిత్​ శర్మ, భారత కెప్టెన్​

టెస్టు సిరీస్‌ సొంతం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని.. వ్యక్తిగతంగానే కాకుండా జట్టుగా తామెంతో సాధించామన్నాడు రోహిత్. ప్రేక్షకులు మళ్లీ స్టేడియాల్లోకి రావడం ఉత్సాహం కలిగిస్తోందని చెప్పాడు.

బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరిగిన పింక్​ బాల్ టెస్టులో టీమ్​ఇండియా ఘనవిజయం సాధించింది. మ్యాచును మూడు రోజుల్లోనే ముగించి సిరీస్​ను 2-0తో క్లీన్​స్వీప్​ చేసింది.

ఇదీ చదవండి:India Vs Sri Lanka: గులాబీ టెస్టులో టీమ్​ఇండియా ఘన విజయం

ABOUT THE AUTHOR

...view details