IND VS SL Test: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా శ్రీలంకతో రెండో టెస్టుకు సిద్ధమైంది టీమ్ఇండియా. శనివారం (మార్చి 12) ఈ డేనైట్ టెస్టు ప్రారంభంకానుంది. తొలి టెస్టులో భారీ విజయాన్ని నమోదు చేసిన భారత్.. ఈ గులాబీ టెస్టులోనూ గెలిచి రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే పలువురు రికార్డులకు చేరువయ్యారు ఇరు జట్లు క్రికెటర్లు. ఈ మ్యాచ్‌లో వాటిని చేరుకుంటారో లేదో చూడాలి.
- భారత కెప్టెన్ రోహిత్ శర్మ మరో 3 క్యాచులు పడితే.. టెస్టుల్లో 50 క్యాచులు పట్టిన ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు.
- టీమ్ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో నాలుగు వికెట్లు తీస్తే దక్షిణాఫ్రికా పేసర్ డేల్ స్టేయిన్ను అధిగమిస్తాడు. దీంతో టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన ఎనిమిదో బౌలర్‌గా ఘనత వహిస్తాడు.
- శ్రీలంక ఆటగాడు డిక్వెల్లా టెస్టుల్లో 2500 పరుగులకు నాలుగు పరుగుల దూరంలో ఉన్నాడు.
- భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మరో 9 వికెట్లు తీస్తే టెస్టుల్లో 250 వికెట్ల క్లబ్లో చేరతాడు.
- హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌తో అన్ని ఫార్మాట్లలో కలిపి అంతర్జాతీయంగా 400 మ్యాచులను పూర్తి చేసుకుంటాడు.
- రవీంద్ర జడేజా టెస్టుల్లో 2500 పరుగుల మార్కును చేరుకోవడానికి 130 పరుగుల దూరంలో ఉన్నాడు.
- భారత వికెట్‌కీపర్ రిషభ్ పంత్ ఎనిమిది సిక్సర్లు కొడితే.. సుదీర్ఘ ఫార్మాట్లో 50 సిక్సర్ల జాబితాలో చేరతాడు.
- అంతర్జాతీయ మ్యాచుల్లో 650 బౌండరీలకు దిముత్ కరుణరత్నే 5 ఫోర్ల దూరంలో ఉన్నాడు.
- రవిచంద్రన్ అశ్విన్ 95 పరగులు చేస్తే టెస్టుల్లో 3వేల పరుగులను చేరుకుంటాడు.
- ఈ మ్యాచ్‌తో 250 అంతర్జాతీయ మ్యాచులను పూర్తిచేసుకుంటాడు అశ్విన్.
- శ్రీలంక ఆటగాడు విశ్వ ఫెర్నాండో 8 వికెట్లు తీస్తే టెస్టుల్లో 50 వికెట్లను పూర్తిచేసుకుంటాడు.
- జస్ప్రీత్ బుమ్రా అంతర్జాతీయ మ్యాచుల్లో 300 వికెట్లకు 5 వికెట్ల దూరంలో ఉన్నాడు.
- దినేశ్ చండిమాల్ విదేశాల్లో 2500 పరుగుల మార్క్ సాధించాలంటే మరో 84 పరుగులు చేయాలి.
- ధనుంజయ డిసిల్వా టెస్టు మ్యాచుల్లో 300 ఫోర్లకు ఒక్క బౌండరీ దూరంలో ఉన్నాడు.
- ఎంజెలో మాథ్యూస్ అన్ని ఫార్మాట్లలో కలిపి 300 సిక్సర్లకు నాలుగు సిక్సర్ల దూరంలో ఉన్నాడు.
- కుశాల్ మెండిస్ అన్ని ఫార్మాట్లలో కలిపి 6000 పరగుల మైలురాయిని చేరుకోవడానికి మరో 43 పరుగులు అవసరం.
- రిషభ్ పంత్ తొమ్మిది ఫోర్లు కొడితే టెస్టుల్లో 200 బౌండరీలు సాధిస్తాడు.
- డిసిల్వా మరో 4 క్యాచులు పడితే టెస్టుల్లో 50 క్యాచులను పూర్తి చేసుకుంటాడు.
- అక్షర్ పటేల్ అంతర్జాతీయ క్రికెట్లో 100 వికెట్లకు ఆరు వికెట్ల దూరంలో ఉన్నాడు.
- రిషభ్ పంత్ అన్ని ఫార్మాట్లలో కలిపి 100 సిక్సర్లు పూర్తి చేసుకోవడానికి మరో 5 సిక్సులు కావాలి.