టీమ్ఇండియా, శ్రీలంక జట్ల మధ్య మొహాలీ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మొదటి సెషన్ పూర్తయింది. 26 ఓవర్ల పాటు సాగిన ఈ సెషన్లో భారత్ 2 వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసింది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (15), హనుమ విహారి (30) క్రీజులో ఉన్నారు.
IND VS SL: లంచ్ విరామానికి టీమ్ఇండియా 109/2.. క్రీజులో కోహ్లీ - IND VS SL TEST
శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ నిలకడగా కొనసాగుతోంది. లంచ్ విరామానికి 2 వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసింది టీమ్ఇండియా.
IND VS SL TEST
శ్రీలంక బౌలర్లలో లాహిరు కుమార, లసిత్ ఎంబుల్దెనియా తలో వికెట్ పడగొట్టారు.