టీమ్ ఇండియా.. శ్రీలంక చేతిలో టీ-20 సిరీస్ ఓడింది. వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో గెల్చిన యువభారత్.. పొట్టి ఫార్మాట్లో మాత్రం మెరుగైన ప్రదర్శన చేయలేకపోయింది. అయితే ప్రధాన ఆటగాళ్లు లేని ఆ జట్టులో అనుభవలేమి దెబ్బతీసిందని చెప్పొచ్చు. ధావన్, భువనేశ్వర్, కుల్దీప్ యాదవ్ మినహా అంతా కొత్తవాళ్లే. ఇదే మంచి అవకాశంగా భావించిన.. లంక జట్టు సమష్టి ప్రదర్శనతో టీ-20 ట్రోఫీని ఎగరేసుకుపోయింది.
ఈ మ్యాచ్‌లో నమోదైన గణాంకాలు ఓ సారి పరిశీలిద్దాం..
2019 నుంచి టీమ్ ఇండియాకు టీ-20 సిరీస్ ఓటమే లేదు. మొత్తం 8 సిరీస్‌లకు 7 గెలిచి, ఒకటి డ్రా చేసుకుంది. ఈ వరుస విజయాల రికార్డుకు ఇప్పుడు బ్రేక్ పడింది.
- భారత్‌పై గెలుపుతో టీ-20 సిరీస్ పరాజయాలకు బ్రేక్ వేసింది లంక. గత ఐదు టీ-20 సిరీస్‌లలోనూ లంక ఓడింది.
- 2008 ఆగస్టు తర్వాత.. శ్రీలంక, ఇండియాపై ఓ ద్వైపాక్షిక సిరీస్(అన్ని ఫార్మాట్లు) గెలవడం ఇదే తొలిసారి.
- ఈ సిరీస్‌కు ముందు మొత్తం 13 సంవత్సరాల్లో 20 సిరీస్‌లు జరగ్గా.. అన్నింటా టీమ్ ఇండియాదే పైచేయి.
- 21వ ప్రయత్నంలో సఫలమైంది శ్రీలంక.
- ద్వైపాక్షిక టీ-20 సిరీస్‌ల పరంగా చూసుకుంటే.. ఇది 8వ సారి.
- గత 7 సిరీస్‌ల్లోనూ భారత్ చేతిలో లంకేయులు టీ-20 సిరీస్‌ల్లో ఓడారు.
టీ-20ల్లో తమ మూడో అత్యల్ప స్కోరు నమోదు చేసింది టీమ్ ఇండియా. ఆస్ట్రేలియాపై 2008లో చేసిన 74 పరుగులే ఇప్పటివరకు భారత్‌కు టీ-20ల్లో అత్యల్ప స్కోరు.
- 74(ఆస్ట్రేలియాపై)- మెల్బోర్న్-2008
- 79(న్యూజిలాండ్‌పై)- నాగ్‌పుర్- 2016
- 81/8(శ్రీలంకపై)- కొలంబో 2021
- 92(సౌతాఫ్రికాపై)- కటక్-2015
20 ఓవర్లు ఆడి.. తక్కువ స్కోరు చేసిన జట్లు..
- వెస్టిండీస్- 79/7 (జింబాబ్వేపై)- 2010
- ఇండియా- 81/8 (శ్రీలంకపై)- 2021
- బంగ్లాదేశ్- 85/9 (పాకిస్థాన్‌పై)- 2011
- ఐర్లాండ్- 85/8(వెస్టిండీస్‌పై)- 2014
బర్త్ డే ఘనత..
పుట్టినరోజు నాడు టీ-20ల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాడిగా నిలిచాడు శ్రీలంక బౌలర్ వనిందు హసరంగ. 4 ఓవర్లలో 9 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడీ స్పిన్నర్.
2014లో ఇమ్రాన్ తాహిర్ (4/21), 2019లో యువరాజ్ సింగ్ (3/23) బర్త్ డే రోజు మంచి ప్రదర్శనలు చేశారు.