శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల టీ-20 సిరీస్‌లో భాగంగా... రెండో మ్యాచ్ కోసం భారత్ జట్టు సిద్ధమవుతోంది. ఇప్పటికే తొలి మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉన్న భారత్, రెండో మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. అయితే తొలి మ్యాచ్‌లో బయటపడిన లోపాలను రెండో మ్యాచ్‌లో సరిదిద్దుకోవాలని భావిస్తోంది. పవర్ ప్లేలో పరుగులు చేయడంలో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ తడబడుతుండగా రెండో మ్యాచ్‌లోనైనా రాణించాలని కోరుకుంటోంది. మొదటి మ్యాచ్‌లో క్రమంగా వికెట్లు కోల్పోవడం వల్ల భారత్ 162 పరుగులు మాత్రమే చేయగా రెండో మ్యాచ్‌లో భారీ స్కోర్ చేయాలని జట్టు భావిస్తోంది.
IND VS SL: లంకతో రెండో టీ20కు రెడీ.. టీమ్ఇండియాలో ఆ ఇద్దరు ప్లేయర్సే సమస్య
శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల టీ-20 సిరీస్‌లో మొదటి మ్యాచ్ గెల్చిన భారత్ జట్టు రేపు జరిగే రెండో మ్యాచ్ కోసం సిద్ధమవుతోంది. తొలి మ్యాచ్‌లో చివరి బంతికి విజయాన్నిఅందుకున్న హార్దిక్ సేన బ్యాటింగ్, బౌలింగ్‌లో కనిపించిన లోటుపాట్లను రెండోమ్యాచ్‌లో సరిచేసుకోవాలని భావిస్తోంది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకోవాలని కసరత్తు చేస్తోంది.
మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ బాగానే రాణిస్తుండగా సూర్య కుమార్ యాదవ్, సంజూ శాంసన్ కూడా తమ స్థాయికి తగ్గట్టు ఆడితే భారీ స్కోర్ చేయడం పెద్ద కష్టమేమీ కాదని అంచనా వేస్తోంది. బౌలింగ్ విభాగంలో శివం మావి.. తొలి మ్యాచ్‌లో నాలుగు వికెట్లతో సత్తాచాటగా ఉమ్రాన్ మాలిక్ సైతం రెండు వికెట్లు పడగొట్టి, సారథి హార్దిక్ పాండ్యా వద్ద మంచి మార్కులు సాధించారు. అయితే యజువేంద్ర చాహల్ పేలవ ప్రదర్శన జట్టును ఆందోళనకు గురిచేస్తోంది.
మరోవైపు తొలి మ్యాచ్‌లో భారత్‌కు గట్టి పోటీ ఇచ్చిన శ్రీలంక జట్టు రెండో మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్ సమం చేయాలని పట్టుదలగా ఉంది. బౌలింగ్ విభాగంలో మెరుగ్గా రాణించినప్పటికీ బ్యాటింగ్ లోపాలను సరిచేసుకోవాలని యోచిస్తోంది.
ఇదీ చూడండి:అవి బంతులా.. బుల్లెట్లా.. ఉమ్రాన్ దెబ్బకు బుమ్రా రికార్డ్ బ్రేక్