శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో టీమ్ ఇండియా బౌలర్లు అదరగొట్టారు. దీంతో 39.4 ఓవర్లలో లంక 215 పరుగులకు ఆలౌటైంది. మొదట టాస్ గెలిచిన లంక బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే మహ్మద్ షమీ బౌలింగ్ ప్రారంభించగా.. ఆరో ఓవర్ ఆఖరి బంతికి సిరాజ్ అవిష్క ఫెర్నాండోను బౌల్డ్ చేశాడు. దీంతో 29 పరుగుల వద్ద ఓపెనర్ రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత లంకను అరంగేట్ర బ్యాటర్ నువానీడు ఫెర్నాండో(50) అర్ధశతకంతో ఆదుకున్నాడు. కుశాల్ మెండిస్‌తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే, జట్టులో రీ ఎంట్రీ ఇచ్చిన భారత చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ఈ జోడీని విడగొట్టాడు. 17వ ఓవర్ చివరి బంతికి మెండిస్(34) పెవిలియన్ చేరాడు. దీంతో 102 పరుగుల వద్ద లంక రెండో వికెట్‌ను కోల్పోయింది.
IND VS SL: అదరగొట్టిన కుల్దీప్.. లంక బ్యాటర్లు విలవిల - టీమ్ఇండియా శ్రీలంక మ్యాచ్ అప్డేట్స్
16:53 January 12
తిప్పేసిన కుల్‌దీప్.. శ్రీలంక ఆలౌట్
ఆ తర్వాత ఓవర్లోనే అక్షర్.. ధనన్జయ డిసిల్వను బౌల్డ్ చేయగా.. డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న నువానీడు అక్షర్ బౌలింగ్‌లో రనౌట్ అయ్యాడు. ఇక తొలి వన్డేలో సెంచరీతో ఆకట్టుకున్న లంక కెప్టెన్ డాసన్ శనక.. కుల్దీప్ బౌలింగ్‌లో కేవలం 2 పరుగులు మాత్రమే చేసి బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత చరిత్ అసలంక(15) కూడా కుల్దీప్ బౌలింగ్‌లోనే ఔటయ్యాడు.
అనంతరం ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో హసరంగ(21) ఏడో వికెట్‌గా వెనుదిరగగా.. క్రీజులో నిలదొక్కుకునేందుకు ప్రయత్నించిన కరుణరత్నెను(17) ఉమ్రాన్ మాలిక్ ఔట్ చేశాడు. ఇక ఆఖర్లో దునిత్ వెల్లలగె(32) కాసేపు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. అతడిని ఔట్ చేసిన సిరాజ్.. తర్వాత లాహిరు కుమారను కూడా పెవిలియన్‌కు పంపాడు. దీంతో లంక ఇన్నింగ్స్‌కు తెరపడింది. మొత్తంగా 39.4 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్, సిరాజ్ చెరో మూడు వికెట్లతో ఆకట్టుకోగా.. ఉమ్రాన్ మాలిక్ రెండు, అక్షర్ పటేల్ వికెట్ తీశారు.
ఇదీ చూడండి:సచిన్, కోహ్లీకి తేడా ఇదే.. ఇద్దరిలో ఎవరు గొప్ప అంటే