శ్రీలంకతో రెండో టీ20కి ముందు టీమ్ఇండియాకు షాక్ తగిలింది. కృనాల్ పాండ్యాతో సన్నిహితంగా మెలిగిన క్రికెటర్లు చివరి రెండు మ్యాచ్‌లకు దూరం కానున్నారు. వారి స్థానంలో కుర్రాళ్లకు అవకాశమివ్వనుంది జట్టు.
కృనాల్‌కు కరోనా నిర్ధరణ కావడం వల్ల మంగళవారం జరగాల్సిన రెండో టీ20.. బుధవారానికి వాయిదా పడింది. అతడితో సన్నిహితంగా ఉన్న హర్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, పృథ్వీ షా, దీపక్ చాహర్, క్రిష్ణప్ప గౌతమ్, ఇషాన్ కిషన్, యుజ్వేంద్ర చాహల్, మనీష్ పాండే ఈ రోజు మ్యాచ్‌కు దూరం కానున్నారు. వీరి స్థానంలో దేవదత్ పడిక్కల్, ఇషాన్ పోరెల్, సందీప్ వారియర్, అర్ష్‌దీప్ సింగ్, సాయి కిషోర్, సిమ్రాన్‌జీత్ సింగ్.. జట్టుతో కలవనున్నారు. మిగిలిన రెండు మ్యాచ్‌లకు ఈ స్క్వాడ్‌తోనే ఆడనుంది టీమ్ఇండియా.