తెలంగాణ

telangana

ETV Bharat / sports

IND VS SL: కోహ్లీ సూపర్​ సెంచరీ.. రోహిత్​ మిస్​... సచిన్​ రికార్డ్​ సమం.. ​ - శ్రీలంక టీమ్​ఇండియా వన్డే మ్యాచ్​

లంకతో జరుగుతున్న తొలి వన్డేలో టీమ్​ఇండియా భారీ స్కోరు చేసింది. ప్రత్యర్థి జట్టుకు 374 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. స్టార్​ బ్యాటర్లు కోహ్లీ, రోహిత్​ శర్మ అదరగొట్టేశారు. విరాట్​ సెంచరీ బాది.. దిగ్గజ క్రికెటర్​ సచిన్ రికార్డును సమం చేయగా..హిట్​మ్యాన్​ తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు.

IND VS SL Kohli century  Srilanka target
శ్రీలంక వన్డే సిరీస్​ కోహ్లీ సెంచరీ

By

Published : Jan 10, 2023, 5:03 PM IST

Updated : Jan 10, 2023, 7:08 PM IST

లంకతో జరుగుతున్న తొలి వన్డేలో టీమ్​ఇండియా బ్యాటర్లు అదరగొట్టారు. దీంతో భారత జట్టు నిర్ణీత 50 A ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 373 పరుగుల భారీ స్కోరు సాధించింది. స్టార్​ బ్యాటర్లు కోహ్లీ, రోహిత్ శర్మ, శుభమన్ గిల్ అదరగొట్టేశారు. విరాట్ (113; 87 బంతుల్లో 12 ఫోర్లు, 1సిక్స్) ​ ఏకంగా సెంచరీ బాది దిగ్గజ క్రికెటర్ సచిన్ రికార్డును బద్దలు కొట్టాడు. తాజా శతకంతో.. స్వదేశంలో అత్యధికంగా 20 శతకాలు బాదిన సచిన్ సరసన చేరాడు. వన్డేల్లో అతడికిది 45వ సెంచరీ కాగా.. శ్రీలంకపై తొమ్మిదోది.

ఇక ఈ మ్యాచ్​లో ఓపెనర్లు రోహిత్ శర్మ (83; 67 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్లు), శుభమన్​ గిల్ (70; 60 బంతుల్లో 11 ఫోర్లు) రాణించగా.. శ్రేయస్ అయ్యర్ (28), కేఎల్ రాహుల్ (39), హార్దిక్ పాండ్య (14), అక్షర్ పటేల్ (9), సిరాజ్ (7), షమి (4) పరుగులు చేశారు. లంక బౌలర్లలో కసన్ రజితా మూడు, మదుశంక, ధనంజయ, కరుణరత్నె, శాన్ తలో వికెట్ పడగొట్టారు.

కోహ్లీ

కోహ్లీ రికార్డులు..

  • స్వదేశంలో 20 సెంచరీలు సాధించి.. సచిన్‌తో సమంగా కోహ్లీ నిలిచాడు. అయితే మొత్తం 49 వన్డే సెంచరీల్లో సచిన్‌ 20 (164 వన్డేల్లో) కొట్టగా.. కోహ్లీ కేవలం 102 వన్డేల్లోనే 20 సెంచరీలను భారత్‌ వేదికగానే బాదాడు.
  • శ్రీలంకపై అత్యధికంగా సెంచరీలు సాధించిన బ్యాటర్‌గా విరాట్‌ రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు ఎనిమిదేసి శతకాలతో సచిన్‌, కోహ్లీ సమంగా ఉండేవారు. ఇప్పుడు 9వ సెంచరీని కోహ్లీ తన ఖాతాలో వేసుకొన్నాడు. అలాగే ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లపై తొమ్మిది సెంచరీలు సాధించిన బ్యాటర్‌గా అవతరించాడు.
  • అన్ని ఫార్మాట్లలో కలిపి విరాట్ శతకాల సంఖ్య 73కి చేరింది. ఇందులో 27 టెస్టు సెంచరీలు కాగా.. మరో 45 వన్డే శతకాలు ఉన్నాయి. గతేడాది ఆసియా కప్‌లో తొలిసారి టీ20ల్లోనూ సెంచరీ నమోదు చేశాడు. దీంతో సచిన్‌ (100) తర్వాత విరాట్ (73) అత్యధిక శతకాలతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
  • ప్రస్తుతం వన్డేల్లో విరాట్ కోహ్లీ 12,584 పరుగులతో ఆరో స్థానంలో ఉన్నాడు. అతడి కాస్త దూరంలో జయవర్దెనె (12,650) ఉన్నాడు. ఇక ఈ జాబితాలో సచిన్‌ 18,426 పరుగులతో అగ్రస్థానంలో ఉండటం విశేషం.
    కోహ్లీ

రోహిత్​ సెంచరీ మిస్​.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కొత్త ఏడాదిని ఘనంగా ఆరంభించాడు. గాయం నుంచి కోలుకుని జట్టులోకి వచ్చిన హిట్​మ్యాన్​ తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. గౌహతి వేదికగా శ్రీలంకతో తొలి వన్డేలో రోహిత్‌ అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. ఈ మ్యాచ్‌లో 67 బంతులు ఎదుర్కొన్న హిట్‌మ్యాన్‌.. 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 83 పరుగులు చేశాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన రోహిత్‌ తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. 83 పరుగులు చేసిన హిట్‌మ్యాన్‌ శ్రీలంక పేసర్‌ మధుశంక బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డ్‌గా వెనుదిరిగాడు.

రోహిత్​

ఇదీ చూడండి:IND VS SL: సెంచరీపై కోహ్లీ రియాక్షన్.. అది తోడుండటం వల్లే జరిగిందటా

Last Updated : Jan 10, 2023, 7:08 PM IST

ABOUT THE AUTHOR

...view details