శ్రీలంకతో జరగుతోన్న రెండో టీ20లో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది టీమ్ఇండియా. నేడు కొలంబో వేదికగా జరగబోతున్న ఈ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచిన లంక బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు కరోనా సోకిన కృనాల్ పాండ్యా సహా మరో 8 మంది గైర్హాజరయ్యారు. ఇప్పటికే సిరీస్‌లో 1-0తో ముందంజలో ఉన్న ధావన్ సేన.. ఈ మ్యాచ్‌ను గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది.
కొత్త ఆటగాళ్లు
కరోనా కారణంగా ఈ మ్యాచ్‌కు టీమ్ఇండియాకు చెందిన ఎనిమిది మంది ఆటగాళ్లు గైర్హాజరయ్యారు. కృనాల్ పాండ్యాకు కరోనా సోకడం వల్ల అతడితో పాటు మరో 8 మంది ఈ మ్యాచ్ ఆడట్లేదు. దీంతో ఈ మ్యాచ్‌లో నలుగురు కొత్త ఆటగాళ్లు టీ20 అరంగేట్రం చేయనున్నారు. దేవ్‌దత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, నితీశ్ రానా, చేతన్ సకారియా భారత జట్టు తరఫున పొట్టి ఫార్మాట్లో వారి తొలి మ్యాచ్ ఆడబోతున్నారు.
ఇక లంక తరఫున ఇద్దరు ఆటగాళ్లు అరంగేట్రం చేస్తన్నారు. రమేశ్ మెండిస్‌తో పాటు సదీరా సమరవిక్రమ టీ20ల్లో తమ తొలి మ్యాచ్ ఆడబోతున్నారు.
జట్లు..