శ్రీలంకతో జరుగుతోన్న రెండో టీ20లో భారత బ్యాట్స్‌మెన్ పరుగులు సాధించడంలో విఫలమయ్యారు. ధావన్ 40 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఫలితంగా తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా 5 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేయగలిగింది.
INDvsSL: తడబడిన భారత బ్యాట్స్‌మెన్.. లంక లక్ష్యం 133 - IND vs SL match updares
శ్రీలంకతో జరుగుతోన్న రెండో టీ20లో టీమ్ఇండియా బ్యాట్స్‌మెన్ తడబడ్డారు. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 132 పరుగులు చేయగలిగింది.
![INDvsSL: తడబడిన భారత బ్యాట్స్‌మెన్.. లంక లక్ష్యం 133 india](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12604285-1066-12604285-1627487675156.jpg)
మొదట టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు శుభారంభాన్ని అందించారు ధావన్, రుతురాజ్ గైక్వాడ్. భారత్ 49 పరుగుల వద్ద ఉన్నపుడు గైక్వాడ్ 18 బంతుల్లో 21 పరుగులు చేసి ఔటయ్యాడు. అనంతరం గబ్బర్‌తో కలిసి సమయోచితంగా బ్యాటింగ్ చేశాడు అరంగేట్ర బ్యాట్స్‌మన్ దేవ్‌దత్ పడిక్కల్. వీరు దూకుడుగా ఆడుతున్న సమయంలో 40 పరుగులు చేసిన ధావన్‌ను పెవిలియన్ చేర్చాడు ధనంజయ. మరికొద్దిసేపటికే పడిక్కల్ 29 పరుగులు చేసి క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. సంజూ శాంసన్ (7) విఫలమయ్యాడు. చివర్లో భువనేశ్వర్ కుమార్(13) దాటిగా ఆడటం వల్ల నిర్ణీత ఓవర్లలో 132 పరుగులు చేసింది టీమ్ఇండియా.
శ్రీలంక బౌలర్లలో అఖిల ధనంజయ 2, హసరంగ, దసున్ శనక, చమీరా చెరో వికెట్ దక్కించుకున్నారు.