IND VS SL Teamindia won Test series: శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లో విజయం సాధించడం వల్ల టీమ్‌ఇండియాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మొహాలీలో జరిగిన తొలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో గెలుపొందింది. బెంగళూరు వేదికగా జరిగిన పింక్‌బాల్ టెస్టులోనూ భారత్ ఆధిపత్యం కొనసాగించింది. ఈ మ్యాచులో 238 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో టెస్టు సిరీస్ 2-0 తేడాతో భారత్ సొంతమైంది.
శ్రీలంకపై టీమ్‌ఇండియా ఘన విజయం.. దిగ్గజాలు ఏమన్నారంటే? - టీమ్ఇండియాదే సిరీస్
IND VS SL Teamindia won Test series: శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లో టీమ్‌ఇండియా ఘన విజయం సాధించి సిరీస్‌ను సొంతం చేసుకుంది. దీంతో భారత జట్టును దిగ్గజ క్రికెటర్లు ప్రశంసిస్తున్నారు. ఎవరెవరు ఏమన్నారంటే..
![శ్రీలంకపై టీమ్‌ఇండియా ఘన విజయం.. దిగ్గజాలు ఏమన్నారంటే? ind vs Sl test series](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14734790-thumbnail-3x2-teamindia.jpg)
టీమ్‌ఇండియా సాధించిన ఈ విజయంపై క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్..'పింక్, వైట్, రెడ్ బాల్ క్రికెట్లో భారత్ గొప్ప ప్రదర్శన చేసింది' అని ట్వీట్ చేయగా.. 'శ్రేయస్ అయ్యర్ రెండు ఇన్నింగ్సుల్లోనూ చూడచక్కని షాట్లు ఆడాడు. రిషభ్ పంత్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. జస్ప్రీత్ బుమ్రా మరోసారి తన క్లాస్ బౌలింగ్ కట్టిపడేశాడు. భారత బౌలర్లను ఎదుర్కొనేందుకు శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్నె ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు' అని వీవీఎస్ లక్ష్మణ్ అన్నాడు. వీరితో పాటు మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్ తదితరులు టీమ్‌ఇండియాపై ప్రశంసలు కురిపించారు. ఎవరెవరు ఏమన్నారో తెలుసుకుందాం..
ఇదీ చూడండి: IND VS SL: ఆ ముగ్గురు అదరగొట్టేశారుగా!