తెలంగాణ

telangana

ETV Bharat / sports

IND VS SL: జడేజా మాయాజాలం.. 174కే లంక ఆలౌట్​ - భారత్​ శ్రీలంక మొదటి టెస్టు

IND VS SL First test: తొలి ఇన్నింగ్స్​లో శ్రీలంక ఘోరంగా విఫలమైంది. 174 పరుగులకే ఆలౌట్​ అయింది. ఫలితంగా 400పరుగుల వెనుకంజలో ఉంది.

test match
srilanka batting

By

Published : Mar 6, 2022, 11:15 AM IST

Updated : Mar 6, 2022, 12:16 PM IST

IND VS SL First test: శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్టులో టీమ్​ఇండియా బౌలర్లు అదరగొట్టారు. తొలి ఇన్నింగ్స్​లో శ్రీలంకను 174 పరుగులకే ఆలౌట్​ చేశారు. ఫలితంగా లంక 400పరుగుల వెనుకంజలో ఉంది. కాగా, శ్రీలంక మొదటి ఇన్నింగ్స్​ పూర్తయ్యాక.. టీమ్​ఇండియా ఫాలో- ఆన్​ ఇచ్చింది. దీంతో శ్రీలంక జట్టే మళ్లీ బ్యాటింగ్​కు దిగింది.

మూడు రోజు ఆటలో భాగంగా తొలి సెషన్​లో భారత బౌలర్లు అదరగొట్టారు. జడేజా ఐదు వికెట్లు తీశాడు. నిస్సంక (61*) ఒక్కడే అర్ధ శతకంతో రాణించాడు. మిగతా బ్యాటర్లంతా పూర్తిగా విఫలమయ్యారు.

ఆదివారం ఓవర్​నైట్​ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన శ్రీలంక మరో 66 పరుగులు జోడించి మిగిలిన ఆరు వికెట్లు కోల్పోయింది. అంతకుముందు ఓవర్​నైట్​ బ్యాటర్లు అసలంక, నిస్సంక తొలి గంట సేపు జాగ్రత్తగా ఆడారు. అయితే, ఈ జోడీని బుమ్రా విడదీశాడు. జట్టు స్కోరు 161 పరుగుల వద్ద అసలంకను ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపడం వల్ల లంక సగం వికెట్లు కోల్పోయింది. అనంతరం భారత బౌలర్లు చెలరేగి 13 పరుగుల తేడాతో మిగిలిన ఐదు వికెట్లు పడగొట్టారు. ఈ క్రమంలోనే జడేజా ఐదు వికెట్ల ఘనత సాధించాడు. బుమ్రా, అశ్విన్​ తలో రెండు వికెట్లు తీయగా.. షమీ ఓ వికెట్​ దక్కించుకున్నాడు. దీంతో భారత్​ తొలి ఇన్నింగ్స్​లో 400 పరుగుల సంపూర్ణ ఆధిక్యం లభించింది.

టెస్టు క్రికెట్‌లో ఆల్ టైమ్ లీడింగ్ వికెట్ టేకర్స్‌ జాబితా టాప్​ టెన్​లోకి.. భారత బౌలర్​ అశ్విన్ ప్రవేశించాడు. రంగనా హెరాత్​తో (433 వికెట్లు- లంక) కలిసి 10వ స్థానంలో నిలిచాడు.

అశ్విన్​ తన టెస్టు కెరీర్​లో అత్యధికంగా బెన్​ స్టోక్స్​ను 11 సార్లు ఔట్​ చేశాడు. డేవిడ్​ వార్నర్​ను 10 సార్లు, అలిస్టర్​ కుక్​ను 9 సార్లు, టామ్​ లాథమ్​ను 8 సార్లు, ఎడ్​ కొవాన్​, అండర్సన్​, తిరిమాన్నెలను తలో 7 సార్లు పెవిలియన్​కు పంపాడు.

ఇదీ చదవండి: IND VS PAK: ఆదుకున్న పూజా, స్నేహ్.. పాకిస్థాన్​ లక్ష్యం ఎంతంటే?

Last Updated : Mar 6, 2022, 12:16 PM IST

ABOUT THE AUTHOR

...view details