తెలంగాణ

telangana

ETV Bharat / sports

Ind Vs SL Asia Cup Finals : టాస్ గెలిచిన లంక.. బౌలింగ్​కి దిగిన టీమ్ఇండియా​ - ఇండియా వర్సెస్​ శ్రీలంక ఆసియా కప్​ టాస్

Ind Vs SL Asia Cup Finals : ఆసియా కప్​ 2023 ఫైనల్స్​కు సమయం ఆసన్నమైంది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తుది పోరు మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. మ్యాచ్​లో భాగంగా టాస్​ గెలుచుకున్న శ్రీలంక జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.

Ind Vs SL Asia Cup Finals
Ind Vs SL Asia Cup Finals

By ETV Bharat Telugu Team

Published : Sep 17, 2023, 2:33 PM IST

Updated : Sep 17, 2023, 2:47 PM IST

Ind Vs SL Asia Cup Finals :ఆసియా కప్​ 2023 ఫైనల్స్​కు సమయం ఆసన్నమైంది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తుది పోరు మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. మ్యాచ్​లో భాగంగా టాస్​ గెలుచుకున్న శ్రీలంక జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.

గత మ్యాచ్​లో ఓటమిని చవి చూసిన రోహిత్​ సేన.. ఈ సారి ఎలాగైన గెలిచి కప్​ను ఇంటికి తీసుకెళ్లలన్న కసితో ఉంది. ఈ క్రమంలో విరాట్​, రోహిత్​ లాంటి స్టార్​ ప్లేయర్స్​ కుడా తమ సత్తా చాటి జట్టును గెలిపించాలంటూ శాయసక్తుల కృషి చేస్తున్నారు. అయితే లంక జట్టును ఓడించాలంటే భారత బ్యాటర్లు సమష్టిగా చెలరేగాల్సిందే.

ఇప్పటి వరకు జరిగిన టోర్నీలో పాకిస్థాన్‌తో జరిగిన సూపర్‌-4 మ్యాచ్‌లో తప్ప మరే మ్యాచ్​లోనూ ప్రధాన బ్యాటర్లు నిలకడగా రాణించలేదు. ఫామ్‌ అందుకున్న ఓపెనర్లు రోహిత్‌, శుభ్‌మన్‌ కూడా జట్టుకు మరోసారి మంచి ఆరంభాన్నివ్వాల్సిన అవసరముంది. బంగ్లాపై అద్భుత శతకం చేసిన శుభ్‌మన్‌.. అంతకుముందు రెండు మ్యాచ్‌ల్లో రోహిత్‌ అర్ధశతకాలు.. ఈ మ్యాచ్​లో ఈ జంట వీటికి మించిందే ఇవ్వాల్సి ఉంది. ఈ క్రమంలో ఫైనల్స్​లో ఈ జోడీ శుభారంభం అందిస్తే జట్టు సగం విజయం సాధించినట్లే.

మరోవైపు లంకపై జరిగిన సూపర్‌-4 మ్యాచ్‌లో విఫలమైన కోహ్లి నుంచి జట్టు భారీ ఇన్నింగ్స్​ను ఆశిస్తోంది. మిడిలార్డర్లో రాహుల్‌, హార్దిక్‌, జడేజా కీలకం కానున్నారు. అయితే సూపర్‌-4 మ్యాచ్‌లో అదిరే ఆరంభం తర్వాత స్పిన్నర్‌ వెల్లలాగే ధాటికి భారత్‌ ఎలా తడబడిందో అందరికి తెలిసిందే. ఇక ఫైనల్‌ పిచ్‌ స్పిన్‌ స్వర్గధామంలా ఉండకపోవచ్చు కానీ.. ఈ మ్యాచ్​లో స్పిన్నర్ల హవా ఉండటం ఖాయమనిపిస్తోంది. కాబట్టి వెల్లలాగె, ఇతర స్పిన్నర్లను జాగ్రత్తగా ఆడాల్సిందే.

పేసర్‌ పతిరనతోనూ ముప్పు పొంచి ఉంది. ప్రధాన స్పిన్నర్‌ తీక్షణ గాయపడి ఫైనల్‌కు దూరం కావడం అనేది భారత్‌కు కొంత కలిసొచ్చేదే. కానీ ధనంజయ డిసిల్వా, అసలంకల రూపంలో లంకకు మెరుగైన ప్లేయర్లు ఉండటం వల్ల రోహిత్​ సేన కాస్చ ఆచి తూచి అడుగులేయాల్సిందే..

భారత్‌: రోహిత్‌ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్, విరాట్ కోహ్లి, రాహుల్‌, ఇషాన్‌ కిషన్, హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా,వాషింగ్టన్​ సుందర్‌, కుల్‌దీప్‌ యాదవ్, జస్​ప్రీత్​ బుమ్రా, మహమ్మద్ సిరాజ్‌.

శ్రీలంక: నిశాంక, కుశాల్‌ పెరీరా, కుశాల్‌ మెండిస్‌, సమరవిక్రమ, అసలంక, శానక (కెప్టెన్), ధనంజయ డిసిల్వా, వెల్లలాగె, హేమంత, మధుషన్, పతిరన.

IND vs SL Asia Cup 2023 Final : ఆసియాకప్‌ ఫైనల్‌ నేడే.. రికార్డులు ఎలా ఉన్నాయంటే?

Ind Vs SL Rain Update : భారత్ - శ్రీలంక మ్యాచ్​ వెదర్​ రిపోర్ట్​.. ఆ రెండు గంటలు తప్పించుకుంటే చాలు..

Last Updated : Sep 17, 2023, 2:47 PM IST

ABOUT THE AUTHOR

...view details