IND vs SL Asia Cup 2023 Final : సొంత గడ్డపై జరిగే వన్డే ప్రపంచకప్‌లో విజేతగా నిలవాలని టీమ్‌ఇండియా గట్టి పట్టుదలతో ఉంది. అదే సమయంలో భారత జట్టు గెలవాలని అభిమానులు కూడా అంతే బలంగా కోరుకుంటున్నారు. అయితే మరి ఆ కప్‌ను అందుకునే దిశగా టీమ్ ఇండియా సరైన అడుగులు వేస్తోందో లేదో తెలుసుకోవడానికి ఇప్పుడో పరీక్ష ఎదురైంది. అదే ఆసియా కప్ ఫైనల్. మరి కొన్ని గంటల్లో ఇది జరగనుంది. ఈ సందర్భంగా మ్యాచ్‌కు సంబంధించిన బలాబలాలు, రికార్డులు, ఇతర విశేషాలు తెలుసుకుందాం..
- వరుస విజయాలతో ఈజీగానే ఫైనల్ అర్హత సాధించిన టీమ్‌ఇండియా.. నామమాత్రపు మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చేతిలో ఓడింది. ఇప్పుడీ తుది పోరులో శ్రీలంకతో తలపడనుంది. ఇందులో విజయం సాధిస్తే.. ప్రపంచకప్ ముంగిట టీమ్‌ఇండియాలో ఆత్మవిశ్వాసం పెరిగినట్టే.
- ఐదేళ్లుగా రెండు కన్నా ఎక్కువ టీమ్స్ పోటీ పడే ఏ టోర్నీలోనూ టీమ్‌ఇండియా నెగ్గలేదు. మరి ఆసియా కప్‌లో ఏం చేస్తుందో..
- ప్రస్తుతం ఈ టోర్నీలో ఆటగాళ్ల ప్రదర్శన చూస్తే.. టీమ్ఇండియానే ఫేవరెట్. కానీ తమతో అంత ఈజీ కాదని.. సూపర్-4 మ్యాచ్‌లో బలమైన పాక్‌పై గెలిచి చూపించారు. పైగా సొంతగడ్డ కాబట్టి.. గట్టి సవాలే.
- ఈ టోర్నీలో పాకిస్థాన్‌తో సూపర్-4 మ్యాచ్‌లో తప్ప ప్రధాన బ్యాటర్లు నిలకడగా ఆడలేదు. రీసెంట్గా బంగ్లాపై సూపర్ సెంచరీ బాదిన శుభమన్.. అంతకుముందు రెండు మ్యాచ్‌ల్లో హాఫ్ సెంచరీలు బాదిన కెప్టెన్ రోహిత్ శర్మ.. ఈ ఇద్దరు ఓపెనర్లు మరోసారి తాజా మ్యాచ్‌లో మంచి శుభారంభాన్ని అందించాల్సిన అవసరం ఉంది. అలా జరిగితే సగం విజయం సాధించినట్లే.
- సూపర్-4 మ్యాచ్‌లో లంకపై ఆకట్టుకోలేకపోయినా కోహ్లీ భారీ ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం ఉంది.
- మిడిలార్డర్లో రాహుల్, హార్దిక్, జడేజా ఎంతో కీలకం.
- పిచ్‌పై స్పిన్నర్లు హవా ఉంటుంది. ఫామ్‌లో ఉన్న స్పిన్నర్ వెల్లలాగేతో పాటు ఇతర స్పిన్నర్లు, పేసర్ పతిరనతో ముప్పు పొంచి ఉంది. గాయంతో ప్రధాన స్పిన్నర్ తీక్షణ ఫైనల్‌కు దూరమవ్వడం భారత్‌కు కలిసొచ్చే విషయమైనా.. ధనంజయ డిసిల్వా, అసలంకల రూపంలో లంకకు మెరుగైన ప్రత్యామ్నాయాలున్నాయి.
తిలక్ ఉంటాడా?.. బంగ్లా మ్యాచ్‌తో వన్డే అరంగేట్రం చేసిన హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ ఫైనల్లో ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తన తొలి వన్డేలో 5 పరుగులే చేసినా.. అతడికి మరో అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు. శ్రేయస్ అయ్యర్‌కు గాయం తిరగబెట్టడంతో అతడు వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఆడలేకపోయాడు. రాబోయే వరల్డ్ కప్‌కు కూడా అనుమానమే. కాబట్టి అతడి స్థానాన్ని తిలక్‌తో భర్తీ చేయొచ్చు. తిలక్‌ను అవకాశమిస్తే.. ఇషాన్‌ను పక్కన పెట్టొచ్చు.
- బంగ్లాతో మ్యాచ్‌కు దూరంగా ఉన్న బుమ్రా, సిరాజ్, కుల్‌దీప్ తుది జట్టులోకి తిరిగి రానున్నారు. ఈ టోర్నీలో అంతగా ఆకట్టుకోని షమి, గాయాలతో ఇబ్బంది పడుతున్న అక్షర్ పటేల్ ఫైనల్లో ఆడే ఛాన్స్ లేదు. పిచ్ స్పిన్‌కు ఎక్కువ అనుకూలం అనుకుంటే వాషింగ్టన్ సుందర్.. లేదంటే శార్దూల్ ఠాకూర్ వస్తారు.
- సూపర్ ఫామ్‌లో ఉన్న కుశాల్ మెండిస్‌తో పాటు నిశాంక, అసలంక, శానకల నుంచి భారత బౌలర్లకు ముప్పు ఉంది. కుశాల్ పెరీరా కూడా డేంజరే. కాబట్టి స్పిన్నర్ కుల్‌దీప్ మరోసారి విజృంభిస్తాడని అంతా ఆశిస్తున్నారు. పేస్ బౌలింగ్‌లో బుమ్రా, సిరాజ్ ఎంతో కీలకం. ఆరంభ ఓవర్లలో వీళ్లిద్దరూ వికెట్లు పడగొడితే.. ఆ తర్వాత కుల్‌దీప్ లాగించేస్తాడు.
- ఈ పిచ్ స్పిన్నర్లదే. కాబట్టి పిచ్‌పై పరుగులు చేయడానికి చెమటోడ్చాల్సిందే.
తుది జట్లు (అంచనా)