తెలంగాణ

telangana

ETV Bharat / sports

IND VS SL 952 runs : 26ఏళ్ల క్రితం టీమ్​ఇండియాను భయపెట్టిన లంక.. ఏకంగా 952/6తో ధనాధన్​! - టీమ్​ఇండియా శ్రీలంక 1997

IND VS SL 952 runs : సరిగ్గా 26ఏళ్ల క్రితం టెస్టులో శ్రీలంక విధ్వంసం సృష్టించిన రోజు ఇది. టెస్టుల్లో 400 పరుగులు చేస్తేనే గొప్ప అనుకునే రోజుల్లో లంక ఏకంగా 952 రన్స్​ స్కోర్​ చేసి అందరి చేత ఔరా అనిపించింది. అది కూడా టీమ్​ఇండియాపై. అయితే ఈ మ్యాచ్ డ్రాగా ముగిసినా లంక ఇన్నింగ్స్​ను ఏ క్రికెట్ అభిమాని మర్చిపోలేరు. ఆ మ్యాచ్ వివరాలు..

ind vs sl
IND VS SL 952 runs : 26ఏళ్ల క్రితం టీమ్​ఇండియాను భయపెట్టిన లంక.. 952/6తో ధనాధన్​!

By

Published : Aug 6, 2023, 7:49 PM IST

IND VS SL 952 runs : 1997 ఆగస్టు 2న కొలంబో వేదికగా శ్రీలంక- భారత్‌ మధ్య టెస్టు మ్యాచ్‌ జరిగింది. ఇందులో టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్​ఇండియా.. 36 పరుగుల వద్దే తొలి వికెట్​ను కోల్పోయింది. అయితే ఆ తర్వాత రాహుల్‌ ద్రవిడ్‌- నవజోత్‌ సిద్ధు కలిసి ఇన్నింగ్స్​ను తమదైన శైలిలో ముందుకు తీసుకెళ్లారు. 13 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో సిద్ధూ 111 పరుగులు చేయగా.. భారత్​ స్కోర్​ 183 వద్ద రెండో వికెట్​గా పెవిలియన్​ బాట పట్టాడు.

ind vs sl 1997 : రాహుల్‌ ద్రవిడ్‌ 197 బంతుల్లో 69 పరుగులు, కెప్టెన్‌ ఇన్నింగ్స్​ 20 ఫోర్ల సాయంతో సచిన్ తెందుల్కర్​ 143 పరుగులు చేశారు. రెండో సెంచరీని ఖాతాలో వేసుకుందామనుకున్న సచిన్​.. మురళీధరన్‌ బౌలింగ్‌లో క్యాచ్‌ ఔట్​గా నిరాశగా వెనుదిరికాడు. ఆ తర్వాత రంగంలోకి దిగిన మహ్మద్‌ అజహరుద్దీన్‌ అద్భుతంగా రాణించాడు. 11 ఫోర్ల సాయంతో 126 పరుగులు చేశాడు. అయితే ఇతడు కూడా మురళీధరన్‌ బౌలింగ్‌లోనే ఔట్ అయ్యాడు.

అనంతరం ​ గంగూలీ డకౌట్ అయ్యాడు. అనిల్‌ కుంబ్లే(27*) పోరాడేందుకు ప్రయత్నించినప్పటికీ... అతనికి సరైన సపోర్ట్‌ దొరకలేదు. ఇక రాజేశ్‌ చౌహాన్‌(23), అబే కురువిల్లా(9) కూడా జట్టు స్కోర్​ పెంచేందుకు తమవంతు ప్రయత్నం చేశారు. అలా తొలి ఇన్నింగ్స్​లో మొత్తం 167.3 ఓవర్లు ఆడిన టీమ్​ఇండియా .. 8 వికెట్ల నష్టానికి 537 పరుగుల వద్ద మ్యాచ్‌ను డిక్లేర్‌ చేసింది.

ind vs sl test 952 scorecard : అయితే రెండో రోజు బ్యాటింగ్ చేసిన శ్రీలంక తమ మొదటి ఇన్నింగ్స్​ను ప్రారంభించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 39 పరుగుల వద్ద మర్వన్ ఆటపట్టు(26) కులకర్ణి బౌలింగ్​లో క్యాచ్ ఔట్​గా వెనుదిరిగాడు. కానీ మూడో రోజు ఆట స్వరూపమే మారిపోయింది. 39 పరుగులకు ఓ వికెట్ కోల్పోయిన లంక రెండో వికెట్ నష్టానికి ఏకంగా 615 పరుగులు చేసింది. రోషన్ మహనమ 27 ఫోర్లతో 225 డబుల్ సెంచరీ చేశాడు. సనత్ జయసూర్యా 36 ఫోర్లు, 2 సిక్సర్లతో 340 పరుగులు చేశాడు. ఆ తర్వాత వచ్చిన డి సిల్వ(126), అర్జున రణతుంగ(86), మహేళ జయవర్దనే(66), కలువితరణ(14*), చమిందా వాస్(11*) కూడా రఫ్పాడించారు. బౌలింగ్ విషయానికి వస్తే.. టీమిండియాలో ఏ బౌలర్ ని శ్రీలంక ఆటగాళ్లు వదల్లేదు.

టీమ్​ఇండియా బౌలర్లలో 78 ఓవర్లు వేసిన రాజేశ్ చౌహాన్ 276 పరుగులు సమర్పించుకున్నాడు. అనీల్ కుంబ్లే అయితే 72 ఓవర్లు వేసి 223 పరుగులు, 70 ఓవర్ల వేసిన నీలేశ్ కులకర్ణి 195 పరుగులు ఇచ్చారు. ఈ ముగ్గురు కేవలం ఒక్కో వికెట్ మాత్రమే దక్కించుకున్నారు. గంగూలీ 9 ఓవర్లలో 53 పరుగులు ఇచ్చి 2 వికెట్లు దక్కించుకున్నాడు. ఐదు రోజుల ఆట ముగిసే సరికి 271 ఓవర్లు ఆడి ఆరు వికెట్ల నష్టానికి ఏకంగా 952 పరుగులు చేసింది లంక. టెస్టుల్లో 400 పరుగులు చేస్తేనే గొప్ప అనుకుంటున్న సమయంలో టీమ్​ఇండియా 537 పరుగులకు డిక్లేర్ చేస్తే.. శ్రీలంక 952 పరుగులు చేసి ఔరా అనిపించింది. ఫైనల్​గా ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది.

Rohit sharma retirement news : 'అప్పటి వరకు ఆడాలని అనుకుంటున్నాను'

Ind Vs WI T20 : టీమ్​ఇండియా @200.. టీ20ల్లో మన స్టార్ ప్లేయర్ల రికార్డులు తెలుసా?

ABOUT THE AUTHOR

...view details