IND vs SL 3rd T20: రోహిత్ సారథ్యంలోని టీమ్ఇండియా వరుస విజయాలతో జోరు మీద ఉంది. శ్రీలంకతో శనివారం జరిగిన రెండో టీ20తో ఇప్పటికే సిరీస్ దక్కించుకున్న టీమ్ఇండియా ప్రత్యర్థిని క్లీన్‌స్వీప్ చేయాలనే లక్ష్యంతో బరిలోకి దిగనుంది. టాస్ గెలిచిన శ్రీలంక టీమ్ఇండియాను బౌలింగ్‌కు ఆహ్వానించింది.
రోహిత్ శర్మ రికార్డ్..
కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మూడో టీ20తో రికార్డు సృష్టించాడు. అత్యధిక టీ20 గేమ్స్ ఆడిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పిన పాక్ ఆటగాడు షోయబ్ మాలిక్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచాడు. షోయబ్ మాలిక్ 124 అంతర్జాతీయ టీ20లు ఆడితే.. లంకతో మూడో టీ20తో రోహిత్ జాబితాలో ఆ సంఖ్య 125కు చేరింది.
ఈ టీ20తో టీమ్ఇండియా మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశం ఉంది. వరుస విజయాలు నమోదు చేసిన టీమ్ఇండియా ఈ మ్యాచ్‌లో కూడా గెలిస్తే.. టీ20ల్లో అత్యధిక వరుస విజయాలు నమోదు చేసిన అఫ్గానిస్థాన్ సరసన నిలుస్తుంది.