తెలంగాణ

telangana

ETV Bharat / sports

IND vs SL 3rd T20: షనక ధనాధన్​ ఇన్నింగ్స్​.. భారత్​ లక్ష్యం 147 - IND vs SL 3rd T20

IND vs SL 3rd T20: భారత బౌలర్ల ధాటికి తడబడిన శ్రీలంకను ఆ జట్టు కెప్టెన్​ దసున్ షనక ఆదుకున్నాడు. ధనాధన్​ ఇన్నింగ్స్​ ఆడి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు సాధించాడు.

IND vs SL 3rd T20
టీమ్​ఇండియా

By

Published : Feb 27, 2022, 8:47 PM IST

IND vs SL 3rd T20: మూడో టీ20లో టీమ్​ఇండియా బౌలర్లు అద్భుతంగా రాణించారు. టాస్​ గెలిచి భారత్​కు బౌలింగ్​ అప్పగించిన శ్రీలంక.. టీమ్​ఇండియా బౌలర్ల ధాటికి నిలవలేకపోయింది. ఆవేశ్​ ఖాన్​ రెండు వికెట్లు.. సిరాజ్, భిష్ణోయ్​, హర్షల్​ పటేల్​లు​ చెరో వికెట్​ పడగొట్టేసరికి టాప్​ ఆర్డర్​ కుప్పకూలింది.

లంక జట్టు సారథి దసున్ షనక కెప్టెన్​ ఇన్నింగ్స్​ ఆడి జట్టును ఆదుకున్నాడు. 38 బంతుల్లో 74 పరుగులు చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు. తొమ్మిది ఫోర్లు, రెండు సిక్సర్లు బాదాడు. దీంతో శ్రీలంక 20 ఓవర్లు పూర్తయ్యే సమయానికి 146 పరుగులు చేసింది.

టీమ్ఇండియా 20 ఓవర్లలో 147 పరుగల లక్ష్యాన్ని ఛేదించాలి. ఈ మ్యాచ్​లో విజయం సాధిస్తే అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వరుస విజయాలు అందుకున్న అఫ్గానిస్థాన్​ సరసన భారత్​ నిలుస్తుంది.

ఇదీ చూడండి :టీమ్​ఇండియా బస్​లో బుల్లెట్ల కలకలం!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details