కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా టీమ్ఇండియాతో జరిగిన మూడో వన్డేలో శ్రీలంక జట్టు విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 227 పరుగుల లక్ష్యాన్ని లంక జట్టు 39 ఓవర్లలో ఛేదించింది. ఫలితంగా శ్రీలంక జట్టుతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో టీమ్ఇండియా కైవసం చేసుకుంది. లంక విజయంలో బ్యాట్స్‌మెన్‌దే కీలకపాత్ర. బ్యాట్స్‌మెన్ అవిష్క ఫెర్నాండో(76), భానుక రాజపక్సా(65) అర్ధశతకాలతో అలరించారు. మరోవైపు భారత తరఫున అరంగేట్రం చేసిన యువ బౌలర్లు చేతన్ సకారియా 2 వికెట్లు పడగొట్టగా.. కృష్ణప్ప గౌతమ్ ఒక వికెట్ సాధించాడు.
ఆఖరి వన్డేలో శ్రీలంక విజయం.. భారత్‌దే సిరీస్ - శిఖర్ ధావన్
టీమ్ఇండియాతో జరిగిన ఆఖరి వన్డేలో శ్రీలంక జట్టు విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 227 పరుగుల లక్ష్యాన్ని 39 ఓవర్లలోనే లంక జట్టు ఛేదించింది. ఫలితంగా మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో భారత జట్టు కైవసం చేసుకుంది.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు స్వల్ప స్కోరుకే పరిమితమైంది. లంక స్పిన్నర్లు అఖిల ధనంజయ 3/44, జయవిక్రమ 3/59 చెలరేగడం వల్ల భారత్ 43.1 ఓవర్లలో 225 పరుగులకే ఆలౌటైంది. మధ్యలో వర్షం అంతరాయం కలిగించడంతో ఆతిథ్య జట్టు లక్ష్యాన్ని మ్యాచ్ అధికారులు 47 ఓవర్లలో 227గా నిర్ణయించారు. భారత బ్యాట్స్‌మెన్‌లో పృథ్వీ షా (49), సంజూ శాంసన్ (46), సూర్యకుమార్ యాదవ్ (40) ఫర్వాలేదనిపించారు. చివర్లో రాహుల్ చాహర్ (13), నవ్‌దీప్ సైనీ (15) తొమ్మిదో వికెట్‌కు 29 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు.
ఇదీ చూడండి..అదరహో.. జింబాబ్వే చేతిలో బంగ్లాదేశ్ చిత్తు