Virat Kohli: టీమ్‌ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ శైలి వైవిధ్యంగా ఉంటుంది. దానిని అనుకరించి సహచరుల్లో నవ్వులు పూయించాడు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. అందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. శనివారం బెంగళూరు వేదికగా శ్రీలంకతో రెండో టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా విజయం దిశగా సాగుతోంది. అయితే, మ్యాచ్ ప్రారంభమైన తొలిరోజు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇక శ్రీలంక తొలి ఇన్నింగ్స్ ప్రారంభించడానికి ముందు దొరికిన విరామ సమయంలో బుమ్రా ఎలా బౌలింగ్ చేస్తాడో కోహ్లీ చేసి చూపించాడు. దీంతో అక్కడున్న ఆటగాళ్లంతా సరదాగా నవ్వుకున్నారు.
కోహ్లీ చేసిన పనికి నవ్వులే నవ్వులు.. ఏకంగా మ్యాచ్ మధ్యలో.. - విరాట్ కోహ్లీ
Virat Kohli: శ్రీలంకతో రెండో టెస్టు తొలి రోజు ఆట సందర్భంగా భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ నవ్వులు పూయించాడు. పేసర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ శైలిని కోహ్లీ అనుకరించడం వల్ల ఆటగాళ్లంతా నవ్వుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన ఆ వీడియోను మీరూ చూసేయండి.
ఇక తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 109 పరుగులకే ఆలౌటైంది. బుమ్రా స్వదేశంలో తొలిసారి ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. అనంతరం టీమ్‌ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో 303/9 స్కోర్ వద్ద డిక్లేర్డ్ చేయగా లంక ముందు 447 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ బుమ్రా తొలి ఓవర్‌లోనే వికెట్ పడగొట్టాడు. ఓపెనర్ లాహిరు తిరుమాన్నెను(0) డకౌట్‌గా పెవిలియన్ పంపాడు. దీంతో రెండో రోజు ఆట ముగిసేసరికి ఆ జట్టు 28/1తో నిలిచింది.
ఇదీ చదవండి: 'తక్కువ అంచనా వేయొద్దు'.. ఇతర జట్లకు హార్దిక్ హెచ్చరిక