తెలంగాణ

telangana

ETV Bharat / sports

IND Vs SL: ఫ్యాన్స్​కు గుడ్​ న్యూస్​.. 100శాతం ప్రేక్షకులకు అనుమతి - day-night Test

IND Vs SL: శ్రీలంకతో రెండో టెస్టుకు వంద శాతం ప్రేక్షకులకు అనుమతినిచ్చింది కర్ణాటక రాష్ట్ర క్రికెట్​ సంఘం​. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా మార్చి 12 నుంచి ఈ డే/నైట్​ టెస్టు జరగనుంది.

IND VS SL
rohith sharma

By

Published : Mar 10, 2022, 11:11 PM IST

IND Vs SL: క్రికెట్​ అభిమానులకు కర్ణాటక రాష్ట్ర క్రికెట్​ సంఘం​ శుభవార్త అందించింది. శ్రీలంకతో టెస్టు​ సిరీస్​లో భాగంగా జరుగనున్న రెండో టెస్టుకు 100శాతం ప్రేక్షకులను అనుమతినిచ్చింది. మార్చి 12 నుంచి మార్చి 16 వరకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో డే/నైట్​ టెస్టు జరగనుంది.

అంతకుముందు 50 శాతం ప్రేక్షకులకే అనుమతి ఉండగా.. దేశంలో కరోనా అదుపులోకి రావడం వల్ల ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మిగిలిన టికెట్లను మార్చి 11 నుంచి స్టేడియం వద్దే అందుబాటులో ఉంచనున్నారు.

బెంగళూరు వేదికగా జరుగుతున్న ఈ డేనైట్​ టెస్టులో మాజీ కెప్టెన్​ విరాట్​ కోహ్లీ సెంచరీ చేస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. కోహ్లీ చివరిసారిగా 2019లో కోల్​కతాలో బంగ్లాదేశ్​తో జరిగిన డే/నైట్​ మ్యాచ్​లోనే సెంచరీ చేశాడు.

అంతకుముందు శ్రీలంకతో మొహాలీలో జరిగిన మొదటి టెస్టులో భారత్​ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్​ను మూడు రోజుల్లోనే ముగించిన టీమ్​ఇండియా 1-0తో ఆధిక్యంలో ఉంది.

ఇదీ చూడండి:రోహిత్ నోరు జారి ఉంటాడు: పాక్​ మాజీ క్రికెటర్

ABOUT THE AUTHOR

...view details