తెలంగాణ

telangana

ETV Bharat / sports

IND VS SA: 'అలాంటి ఆల్​రౌండర్లు జట్టుకు అవసరం'

IND VS SA: దక్షిణాఫ్రికాతో మూడో వన్డేలో ఆల్​రౌండర్ దీపక్ చాహర్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడని టీమ్​ఇండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ చెప్పాడు. చాహర్​కు ఇచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకున్నాడని తెలిపాడు. శార్దుల్​, చాహర్​ లాంటి ఆల్​రౌండర్లు జట్టుకు అవసరమని అభిప్రాయపడ్డాడు.

IND VS SA
భారత్ దక్షిణాఫ్రికా

By

Published : Jan 24, 2022, 7:56 AM IST

IND VS SA: దక్షిణాఫ్రికాతో ఆదివారం జరిగిన మూడో వన్డేలో ఆల్​రౌండర్ దీపక్ చాహర్ ఇన్నింగ్స్​పై సంతృప్తి వ్యక్తం చేశాడు టీమ్ఇండియా కోచ్ ద్రవిడ్. తనకు లభించిన అన్ని అవకాశాల్లో చాహర్​ ప్రతిభ కనబరచాడని అన్నాడు. అతడికి అద్భుతమైన బ్యాటింగ్ సామర్థ్యం ఉందన్నాడు.

"దీపక్ చాహర్​.. తనకిచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్లపై అద్భుత ప్రదర్శన చేశాడు. చాహర్​కు బ్యాటింగ్​ సామర్థ్యం ఉంది. అతడు బౌలింగ్​తోనూ అద్భుతాలు చేయడం మనకు తెలుసు. భవిష్యత్తులో అతడికి మరిన్ని అవకాశాలు ఉంటాయి." అని మ్యాచ్ అనంతరం టీమ్​ఇండియా హెడ్ కోచ్ ద్రవిడ్ అన్నాడు.

"శార్దుల్​ ఠాకూర్, దీపక్ చాహర్​ లాంటి వాళ్లు జట్టులో ఉండటం టీమ్​కు బలం. బౌలింగ్​తోపాటు బ్యాటింగ్​తోనూ ఆకట్టుకుంటున్నారు." అని ద్రవిడ్ తెలిపాడు.

వరల్డ్​కప్​పై దృష్టి..

IND VS SA: "దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్​లో పరాభవం ​నుంచి పాఠాలు నేర్చుకోవాలి. 2019 వరల్డ్​కప్​ తర్వాత టీమ్​ఇండియా ఎక్కువ వన్డేలు ఆడలేదు. అదృష్టవశాత్తూ 2023 వరల్డ్​కప్​నకు ముందు మాకు సమయం దొరికింది. ఇదో గొప్ప అవకాశం"

దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు, మూడు వన్డేల్లో పేలవ షాట్స్​తో ఓడిపోయాం. స్మార్ట్ క్రికెట్ ఆడలేదని కోచ్ ద్రవిడ్ అన్నాడు. ఈ సిరీస్ ఓటమి నుంచి చాలా నేర్చుకోవాలని తెలిపాడు.

దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్‌ చేసిన సఫారీలు 287 పరుగులకు ఆలౌటయ్యారు. అనంతరం లక్ష్య ఛేదనలో టీమ్‌ఇండియా 49.2 ఓవర్లలో 283 పరుగులకే పరిమితమైంది. విరాట్ కోహ్లీ (65), శిఖర్ ధావన్ (61), దీపక్ చాహర్ (54) అర్ధశతకాలు సాధించినా ఓటమి తప్పలేదు. దీంతో 3-0 తేడాతో ప్రొటీస్ జట్టు సిరీస్​ను కైవసం చేసుకుంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి:IND VS SA: ఉత్కంఠపోరులో భారత్‌ ఓటమి.. క్లీన్‌స్వీప్‌ చేసిన సఫారీలు

ABOUT THE AUTHOR

...view details