తెలంగాణ

telangana

ETV Bharat / sports

సఫారీలతో భారత్ 'ఢీ' - ఆ రికార్డుపై రోహిత్ సేన కన్ను! - భారత్ వర్సెస్ సౌతాఫ్రికా ప్రపంచకప్ రికార్డులు

Ind vs Sa World Cup 2023 : ప్రస్తుత ప్రపంచకప్​లో అత్యుత్తమ జట్లు భారత్ - సౌతాఫ్రికా మధ్య పోరుకు కొన్ని గంటలే మిగిలి ఉంది. మెగాటోర్నీలో ఇప్పటికే సెమీస్ చేరిన భారత్.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకోవాలని భావిస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్​లో గెలిచి సెమీఫైనల్స్​కి అర్హత సాధించాలని సఫారీ జట్టు తహతహలాడుతోంది.

Ind vs Sa World Cup 2023
Ind vs Sa World Cup 2023

By ETV Bharat Telugu Team

Published : Nov 4, 2023, 9:01 PM IST

Ind vs Sa World Cup 2023 :2023 ప్రపంచకప్​లో అసలు సిసలైన పోరుకు రంగం సిద్ధమైంది. ఈ టోర్నీలో అత్యంత విజయవంతమైన టాప్ 2 జట్లు నవంబర్ 5న తలపడనున్నాయి. ఆదివారం కోల్​కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్.. సౌతాఫ్రికాను ఢీకొట్టనుంది. ఇప్పటికే సెమీస్ బెర్తును ఖాయం చేసుకున్న భారత్.. విజయ పరంపర కొనసాగించాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మరోవైపు భారత్​పై నెగ్గి సెమీఫైనల్స్​లోకి దూసుకెళ్లాలని భావిస్తోంది.

టీమ్ఇండియా ఎలా ఉందంటే?భారత్టైటిల్ ఫేవరెట్ జట్లలో ఒకటిగా టోర్నీని ప్రారంభించింది. అందుకు తగ్గట్లుగానే టీమ్ఇండియా ఆటగాళ్లంతా కలిసి కట్టుగా రాణించి విజయాలు సాధిస్తున్నారు. టాపార్డర్​లో కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మంచి ఫామ్​లో ఉన్నారు. గత మ్యాచ్​తో ఓపెనర్ శుభ్​మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ కూడా టచ్​లోకి వచ్చారు. మిడిలార్డర్​లో కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ ఉండనే ఉన్నారు. ఇక టీమ్ఇండియా బౌలింగ్ దళం.. ఇప్పటివరకు జట్టు విజయాల్లో కీలకంగా వ్యవహరించారు. స్వదేశీ పిచ్​లపై అద్భుతంగా రాణిస్తూ.. ప్రత్యర్థుకు చెక్ పెడుతున్నారు. ఆదివారం నాటి మ్యాచ్​లో కూడా అందరూ సమష్టిగా రాణించి గెలుపు స్ట్రీక్​ను కంటిన్యూ చేయాలని టీమ్ఇండియా ఆశిస్తోంది.

సఫారీ జట్టు..మెగాటోర్నీలోకి సౌతాఫ్రికాఅంతంత మాత్రం అంచనాలతో ఎంట్రీ ఇచ్చి.. అదరిపోయే ప్రదర్శనతో ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్​ల్లో 6 విజయాలతో 12 పాయింట్లు సాధించింది. ఫలితంగా సౌతాఫ్రికా జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. క్వింటన్ డికాక్, మర్​క్రమ్, వన్​డర్ ​డస్సెన్, డేవిడ్ మిల్లర్, క్లాసెన్, మార్కో జాన్సన్​తో సఫారీల బ్యాటింగ్ బలంగా ఉంది. మరోవైపు ఎంగ్డి, రబాడా, కేషవ్ మహరాజ్, గార్లాడ్​తో బౌలింగ్ అటాకింగ్​ కూడా భయంకరంగా ఉంది.

జోష్​లో రెండు జట్లు..టోర్నీలో భారత్.. చివరగా శ్రీలంకతో తలపడగా ఏకంగా 302 పరుగుల భారీ విక్టరీ నమోదు చేసింది. మరోవైపు సౌతాఫ్రికా తమ చివరి మ్యాచ్​లో న్యూజిలాండ్​ను 190 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. ఇలా ఈ రెండు జట్లూ.. తమతమ చివరి మ్యాచ్​లో గెలిచి మంచి జోష్​మీదున్నాయి. దీంతో ఇరు జట్లు రెట్టించిన ఉత్సాహంతో పోటీ పడడం ఖాయం. మరి ఆదివారం ఎవరిది పైచేయి కానుందో తెలుసుకోవాలంటే వేచి చూడాలి.

ఆ ఒక్కటీ! ప్రస్తుత ప్రపంచకప్​లో ఘన విజయాలతో దూసుకుపోతున్న సఫారీ జట్టుకు ఈ టోర్నీలో భంగపాటు ఎదురైంది. టోర్నీలో మేటి జట్లను సైతం ఒంటిచేత్తో ఓడించిన సౌతాఫ్రికా.. పసికూన నెదర్లాండ్స్​తో 38 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ ఓటమిని సఫారీ జట్టు ఫ్యాన్స్ ఓ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు.

Ind vs Sa World Cup Head To Head: ప్రపంచకప్​ చరిత్రలో భారత్ - సౌతాఫ్రికా ఇప్పటివరకు 5సార్లు తలపడ్డాయి. ఈ ముఖాముఖి పోరులో సఫారీలదే పైచేయిగా ఉంది. ఐదింట్లో 3 మ్యాచ్​లు సౌతాఫ్రికా (1992, 1999, 2011) నెగ్గగా.. రెండింట్లో టీమ్ఇండియా (2015, 2019) గెలిచింది. కాగా, ఆదివారం నాటి మ్యాచ్​లో భారత్ గెలిస్తే.. ఈ రికార్డు సమం అవుతుంది.

వైస్ కెప్టెన్​గా రాహుల్..టీమ్ఇండియా రెగ్యులర్ వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్య గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో ఆ బాధ్యతలను టీమ్ మేనేజ్​మెంట్.. వికెట్ కీపర్ కేఎల్ రాహుల్​కు అప్పగించింది.

టీమ్​ఇండియాకు షాక్ - ప్రపంచకప్ మిగతా టోర్నీకి హార్దిక్​ దూరం - అతడి స్థానంలో ఎవరంటే?

దక్షిణాఫ్రికా చేతిలో కివీస్ చిత్తు, సెంచరీలతో అదరగొట్టిన డీకాక్​, డసెన్​

ABOUT THE AUTHOR

...view details