IND VS SA: దక్షిణాఫ్రికాతో ఆదివారం జరిగిన మూడో వన్డేలో విరాట్ కోహ్లీ- శిఖర్ ధావన్ జోడీ మరో అరుదైన ఘనత నెలకొల్పింది. గతంలో ధోనీ- రైనా జోడీ సృష్టించిన రికార్డును అధిగమించింది.
ధావన్- కోహ్లీ జోడీ ఇప్పటివరకు 28 సార్లు హాఫ్ సెంచరీలు చేసింది. ధోనీ- రైనాల జోడీ 27 అర్ధశతకాలు నమోదు చేసింది. ఆదివారం జరిగిన మ్యాచ్లో ఈ రికార్డును సృష్టించింది ధావన్- కోహ్లీ జోడీ. ఈ జాబితాలో భారత దిగ్గజాలు గంగూలీ- సచిన్ జోడీ 55కు పైగా అర్ధశతకాల భాగస్వామ్యంతో మొదటి స్థానంలో ఉంది. తర్వాతి స్థానంలో రోహిత్ శర్మ- ధావన్ జోడీ(32 అర్ధసెంచరీల భాగస్వామ్యం) ఉంది.
దక్షిణాఫ్రికాతో మూడో వన్డేలో శిఖర్ ధావన్ 35వ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 73బంతుల్లో 61 పరుగులు చేశాడు.