IND VS SA: దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ నేటితో ముగిసింది. విజయంతో దక్షిణాఫ్రికా పర్యటనను ముగిద్దామని భావించిన భారత్‌కు మూడో మ్యాచ్ కూడా కలిసిరాలేదు. నేడు(ఆదివారం) ఉత్కంఠంగా సాగిన చివరి వన్డేలోనూ టీమ్‌ఇండియా ఓడిపోయింది. ప్రత్యర్థి జట్టు నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించేందుకు చివరికి వరకు పోరాడిన ఫలితం దక్కలేదు. ఫలితంగా ప్రొటీస్ జట్టు నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించి.. మూడు వన్డేల సిరీస్‌ను 3-0 తేడాతో సొంతం చేసుకుంది. అంతకుముందు టెస్టు సిరీస్‌నూ 2-1 తేడాతో గెలుపొందింది.
మూడో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీలు 287 పరుగులకు ఆలౌటైంది. అనంతరం లక్ష్య ఛేదనలో టీమ్‌ఇండియా 49.2 ఓవర్లలో 283 పరుగులకే పరిమితమైంది. విరాట్ కోహ్లీ (65), శిఖర్ ధావన్ (61), దీపక్ చాహర్ (54) అర్ధశతకాలు సాధించినా ఓటమి తప్పలేదు. సూర్యకుమార్ యాదవ్ (39), శ్రేయస్ అయ్యర్ (26) రాణించారు. ఆఖర్లో దీపక్ చాహర్, బుమ్రా (12) విజయం కోసం తీవ్రంగా పోరాడినా ఫలితం దక్కలేదు. మిగతా వారిలో కేఎల్ రాహుల్ 9, పంత్ డకౌట్, జయంత్ యాదవ్ 2, చాహల్ 2, ప్రసిధ్ కృష్ణ 2* పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎంగిడి 3, పెహులక్వాయో 3.. ప్రిటోరియస్ 2, మగలా, కేశవ్ మహరాజ్ చెరో వికెట్ తీశారు.
డికాక్ సూపర్ సెంచరీ