Kohli Daughter vamika photo: టీమ్ఇండియా మాజీ కెప్టెన్ కోహ్లీ-అనుష్క శర్మ ముద్దుల కుమార్తె వామికను చూడాలని అభిమానులు చాలా కాలంగా ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ విరుష్క జోడీ మొదట్నుంచి వామికకు సంబంధించిన ఫొటోలు, ఆమె ముఖాన్ని మీడియా కంట పడకుండా జాగ్రత్త పడుతూ వస్తున్నారు. అప్పుడప్పుడు ముఖం కనిపించడకుండా ఉన్న పాప ఫొటోలను పోస్ట్ చేశారు.
అయితే విరుష్క జోడీ ప్రయత్నం భగ్నమైంది! దక్షిణాఫ్రికా పర్యటనకు కోహ్లీ సతీసమేతంగా వెళ్లాడు. ఇందులో భాగంగా మూడో వన్డేలో.. వామికా ఫేస్ కెమెరా కంటికి చిక్కింది. ఆ మ్యాచ్కు పాపతో కలిసి అనుష్క హాజరుకాగా అక్కడ వారిద్దరూ కలిసి ఉన్న దృశ్యం కెమెరాలో బందీ అయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటో వైరల్గా మారింది. అయితే ఇందులో వామిక పూర్తి ముఖం కనిపించకున్నా.. ఆ చిన్నారి కళ్లు, ముక్కు సైడ్లుక్లో బాగానే కనిపిస్తుంది. అభిమానులు ఈ ఫొటోను ట్రెండింగ్ చేస్తూ విపరీతంగా లైక్స్, కామెంట్స్ చేస్తున్నారు. ఆ ఫొటోను మీరు చూసేయండి..