తెలంగాణ

telangana

ETV Bharat / sports

IND vs SA Test: ఎల్గర్​ కెప్టెన్​ ఇన్నింగ్స్- రెండో టెస్టులో భారత్​ ఓటమి - భారత్ దక్షిణాఫ్రికా మ్యాచ్ స్కోరు

IND vs SA Test: జోహన్నెస్​బర్గ్ వేదికగా భారత్​తో జరిగిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా ఘనవిజయం సాధించింది. డీన్ ఎల్గర్ 96 పరుగులతో అజేయంగా నిలిచి గెలుపులో కీలక పాత్ర పోషించాడు.

elger
ఎల్గర్

By

Published : Jan 6, 2022, 9:26 PM IST

Updated : Jan 6, 2022, 10:54 PM IST

IND vs SA Test: జోహన్నెస్​బర్గ్​ మైదానంలో జరిగిన రెండో టెస్టులో సౌతాఫ్రికా ఘనవిజయం సాధించింది. 240 పరుగుల లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. దక్షిణాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ 96 పరుగులతో నాటౌట్​గా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తెంబా బవుమా(23) అతడికి సహకారం అందించాడు. భారత బౌలర్లలో షమీ, ఠాకూర్‌, అశ్విన్‌ తలో వికెట్ తీశారు.

దక్షిణాఫ్రికా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన సారథి ఎల్గర్ 'ప్లేయర్​ ఆఫ్​ ద మ్యాచ్'గా నిలిచాడు. ​

భారత్ తొలి ఇన్నింగ్స్​లో 202 పరుగులకు ఆలౌటైంది. బదులుగా సౌతాఫ్రికా 229 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్​లో 266 పరుగులు చేసిన టీమ్ ఇండియా.. దక్షిణాఫ్రికా ముందు 240 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

మూడు మ్యాచ్​ల సిరీస్​లో ప్రస్తుతం ఇరుజట్లు 1-1తో సమంగా ఉన్నాయి. చివరిదైన మూడో టెస్టు కేప్ టౌన్ వేదికగా జనవరి 11 నుంచి జరగనుంది.

ఇదీ చదవండి:

IND vs SA: 'హార్దిక్‌ లేని లోటును శార్దూల్‌ భర్తీ చేస్తున్నాడు'

Kapil Dev Birthday: 'కపిల్​ దేవ్​కు టీమ్​ఇండియా ఇచ్చే పెద్ద గిఫ్ట్​ అదే'

Last Updated : Jan 6, 2022, 10:54 PM IST

ABOUT THE AUTHOR

...view details