దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో భారత బౌలర్లు పుంజుకున్నారు. దీంతో లంచ్ బ్రేక్ సమయానికి సౌతాఫ్రికా నాలుగు వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 202 పరుగులకు ఆలౌట్ కాగా.. ప్రొటీస్ జట్టు ఇంకా 100 పరుగులు వెనుకబడి ఉంది. శార్దూల్ ఠాకూర్ (3/8) మొదటి సెషన్‌లో దక్షిణాఫ్రికాపై ఆధిపత్యం ప్రదర్శించాడు.
IND vs SA Test: సఫారీకి 'శార్దూల్' దెబ్బ.. ఆధిక్యంపై భారత్ గురి - భారత్-దక్షిణాఫ్రికా రెండో టెస్టు లంచ్ బ్రేక్
IND vs SA Test: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా ఆధిక్యం సాధించేందుకు శ్రమిస్తోంది. రెండో రోజు లంచ్ సమయానికి 4 వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది సఫారీ జట్టు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 100 పరుగులు వెనకపడి ఉంది.

ఓవర్‌నైట్ 35/1 స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన దక్షిణాఫ్రికాకు మంచి ఆరంభమే దక్కింది. డీన్ ఎల్గర్ (120 బంతుల్లో 28 పరుగులు), కీగన్ పీటర్సెన్ (118 బంతుల్లో 62 పరుగులు) క్రీజ్‌లో పాతుకుపోయి అర్ధశతక (74) భాగస్వామ్యం నమోదు చేశారు. తొలి సెషన్‌లో దాదాపు 20 ఓవర్లపాటు ఈ జంట భారత బౌలర్లను కాచుకుంది. ఈ క్రమంలో పీటర్సెన్ తన టెస్టు కెరీర్‌లో తొలి హాఫ్ సెంచరీ నమోదు చేసుకున్నాడు. బుమ్రా, షమీ, సిరాజ్, అశ్విన్ వికెట్ కోసం ఎంత ప్రయత్నించా ఫలితం దక్కలేదు. సఫారీ జట్టు భారీ స్కోరు చేస్తుందని అంతా భావించారు. అయితే శార్దూల్ ఠాకూర్ స్వల్ప వ్యవధిలో మూడు కీలక వికెట్లను కూల్చి టీమ్‌ఇండియాను మళ్లీ రేసులోకి తీసుకొచ్చాడు. ఎల్గర్, పీటర్సెన్, డస్సెన్‌ను ఔట్ చేసి భారత్‌కు బ్రేక్ ఇచ్చాడు.