IND VS SA TEST: విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమ్‌ఇండియా జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లింది. నేటివరకు ఒక్కసారి కూడా ఆఫ్రికా గడ్డ మీద మన జట్టు టెస్టు సిరీస్ నెగ్గలేదు. ఈ సారైనా కప్పుతో స్వదేశానికి తిరిగిరావాలని భావిస్త్తోంది. అయితే.. దక్షిణాఫ్రికా జట్టులో సీనియర్ ఆటగాళ్లు ఏబీ డెవిలియర్స్, డుప్లెసిస్ టెస్టు సిరీస్కు రిటైర్మెంట్ ఇచ్చారు. డీ కాక్ కూడా ఈ టెస్టు సిరీస్కు హాజరుకాకపోవచ్చని సమాచారం. ఈ విషయాన్నే దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ టీమ్ ఇండియాకు కలిసివచ్చే అవకాశం అన్నాడు. 'దక్షిణాఫ్రికా జట్టులో సీనియర్ ఆటగాళ్లు లేకపోవడం కోహ్లీ సేనకు కలిసివస్తుంది. డీకాక్ లేకపోవడం టీమ్‌ఇండియా చరిత్ర సృష్టించడానికి ఇది సరైన సమయం' అని అభిప్రాయపడ్డాడు.
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య డిసెంబర్ 26 (బాక్సింగ్ డే) నుంచి తొలి టెస్టు ప్రారంభమవుతుంది. టెస్టు సిరీస్ కోసం ఆటగాళ్లు కఠినంగా సాధన చేస్తున్నారు.