IND vs SA: ఇప్పటివరకు విదేశాల్లో టీమ్ఇండియా టెస్టు సిరీస్‌ను గెలవని ఏకైక జట్టు దక్షిణాఫ్రికా. అందుకే ఈసారి ఎలాగైనా సరే గెలిచి సరికొత్త రికార్డు సృష్టించాలని భావిస్తుంది కోహ్లీసేన. ఈ మేరకు పదునైన వ్యూహాలను సిద్ధం చేసుకుంటుంది. ఇంకో రెండు రోజుల్లో దక్షిణాఫ్రికాతో జరగబోయే తొలి టెస్టు మ్యాచ్‌లో టీమ్ఇండియా ఐదుగురు బౌలర్ల వ్యూహంతో బరిలోకి దిగే యోచనలో ఉన్నట్లు వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ తెలిపాడు.
IND vs SA Test series: డిసెంబరు 26న ప్రారంభమయ్యే తొలి టెస్టులో టీమ్ ఇండియా శుభారంభం చేస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. వర్చువల్‌గా జరిగిన విలేకర్లు సమావేశంలో.. నలుగురు బౌలర్లతో ఆడితే పనిభారం పెరుగుతుందా అని విలేకరి అడిగిన ప్రశ్నకు సానుకూలంగా బదులిచ్చాడు రాహుల్.
"ప్రతిజట్టు టెస్టులో గెలవడానికి 20 వికెట్లు తీయాలని భావిస్తుంది. మేమూ అదే వ్యూహాంతో ముందుకెళ్తాం. అలా ఆడిన ప్రతిసారి కలిసొచ్చింది. ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగితే పనిభారం కాస్త తగ్గుతుంది. కాబట్టి ఆ వ్యూహంతో టెస్టు మ్యాచ్ ఆడాలనే యోచిస్తున్నాం" అని రాహుల్ పేర్కొన్నాడు. దీంతో నాలుగో పేసర్‌ను ఆడించనున్నట్లు తెలుస్తోంది.
ఐదోస్థానంలో ఎవరిని పంపాలో?
KL Rahul on Rahane: మరోవైపు అజింక్యా రహానె, శ్రేయస్ అయ్యర్లలో ఎవరిని జట్టులోకి తీసుకోవాలో తేల్చుకోవడం సవాలుగా మారిందని కేఎల్ రాహుల్ అన్నాడు.