తెలంగాణ

telangana

ETV Bharat / sports

సఫారీ గడ్డపై 'బాక్సింగ్ డే' టెస్ట్ మ్యాచ్- టీమ్​ఇండియా 30ఏళ్ల కల నిజమయ్యేనా? - భారత్ సౌతాఫ్రితా పర్యటన 2023

Ind Vs Sa Test Series 2023 : టెస్టు క్రికెట్​లో టీమ్ఇండియా అనేక ఘనతలు సాధించింది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ ఇలా అన్ని జట్లను వారివారి సొంత గడ్డపై టెస్టు సిరీస్​ల్లో ఓడించి జయకేతనం ఎగురవేశాయి. కానీ, గత 3 దశాబ్దాలుగా సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ గెలవడం భారత్​కు అందని ద్రాక్షలా మారింది. ఇప్పటివరకు 8 టెస్టు సిరీస్​లు ఆడిన టీమ్ఇండియా ఒక్కసారి కూడా గెలవలేదు. మరి ఈసారైనా నెగ్గి 30 ఏళ్లనాటి నిరీక్షణకు తెర దించుతారో చూడాలి.

Ind Vs Sa Test Series 2023
Ind Vs Sa Test Series 2023

By ETV Bharat Telugu Team

Published : Dec 24, 2023, 9:55 AM IST

Updated : Dec 24, 2023, 11:55 AM IST

Ind Vs Sa Test Series 2023 :2023 వరల్డ్​కప్ తర్వాత సౌతాఫ్రికా పర్యటనలో టీ20, వన్డే సిరీస్​లో యువ భారత్ అదరగొట్టింది. పొట్టి ఫార్మాట్​ సిరీస్​ను 1-1తో సమం చేయగా, 2-1 తేడాతో వన్డే సిరీస్​ను నెగ్గింది. ఇక ఈ పర్యటనలో అందరూ ఎదురుచూస్తున్న టెస్టు సిరీస్​కు సమయం దగ్గరపడింది. ఈ నెల 26న తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే మూడు దశాబ్దాలుగా సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ నెగ్గడం భారత్​కు అందని ద్రాక్షలాగే ఉంది. దీంతో ఈసారైనా సఫారీ గడ్డపై ఆతిథ్య జట్టును ఓడించి చరిత్ర తిరగరాయాలని టీమ్ఇండియా పట్టుదలతో ఉంది. ఇక రోహిత్, కోహ్లీ రాకతో భారత్ మరింత పటిష్ఠంగా కనిపిస్తోంది.

ఇన్నేళ్లపాటు సౌతాఫ్రికాలో టెస్టు సిరీస్ గెలవకపోడానికి అక్కడి పిచ్​లు కూడా ఒక కారణం. పేస్‌, స్వింగ్‌, బౌన్స్‌కు, సహకరించే పిచ్‌లపై బుల్లెట్​లలా దూసుకొచ్చే బంతులను ఎదుర్కోవడం మనోళ్లకు సవాలే. అయితే ఇలాంటి పరిస్థితులు టీమ్ఇండియా బౌలర్లలకూ సానుకూలమే. ప్రస్తుతం మన పేస్​ దళం కూడా దృఢంగా ఉంది. ఒకరకంగా ఇది టీమ్ఇండియా ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఇక ఆతిథ్య జట్టు బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని బ్యాటర్లు రాణిస్తే తిరుగుండదు. క్రీజులో ఎక్కువ సేపు నిలబడగలిగితే పరుగులు సాధించడం సులువు అవుతుంది.

భారత్- సౌతాఫ్రికా (సఫారీ గడ్డపై) గత టెస్టు సిరీస్​ల ఫలితాలు :

  • భారత్ సఫారీలతో 1992లో తొలిసారి టెస్టు సిరీస్ ఆడింది. 4 మ్యాచ్​ల ఈ సిరీస్​ను సౌతాఫ్రికా 1-0తో గెలుచుకుంది. మూడో మ్యాచ్​లో సౌతాఫ్రికా నెగ్గాగా, మిగిలిన 3 మ్యాచ్​లు డ్రా గా ముగిశాయి.
  • 1996లో మూడు మ్యాచ్​ల టెస్టు సిరీస్​లో 2-0తో భారత్ ఓటమి చవిచూసింది. రెండు మ్యాచ్​ల్లో సఫారీలు విజయం సాధించగా, ఓ మ్యాచ్ డ్రా అయ్యింది.
  • 2001లో రెండు మ్యాచ్​ల సిరీస్​ జరిగింది. ఈ సిరీస్​ను కూడా ఆతిథ్య సౌతాఫ్రికా 1-0 తేడాతో గెలుచుకుంది. ఇందులో ఓ మ్యాచ్​లో భారత్ ఓడగా, మరో మ్యాచ్​ను డ్రా చేసుకుంది.
  • 2006 సిరీస్​లో టీమ్ఇండియా మెరుగైన ప్రదర్శనే చేసింది. 3 మ్యాచ్​ల సిరీస్​లో భారత్ తొలిసారి టెస్టు మ్యాచ్​లో విజయం అందుకుంది. కానీ, తర్వాత మ్యాచ్​ల్లో సౌతాఫ్రికా ఆధిపత్యం ప్రదర్శించి 2 విజయాలు నమోదు చేసింది. దీంతో 2-1తో సిరీస్ మరోసారి సఫారీల ఖాతాలోని వెళ్లింది.
  • 2010లో ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో భారత్ బరిలోకి దిగింది. మూడు టెస్టు సిరీస్​ను భారత్ తొలిసారి 1-1తో డ్రా గా ముగించింది. ఈ సిరీస్​లో వీవీఎస్ లక్ష్మణ్, హర్భజన్‌ సింగ్ టీమ్ఇండియాకు కీలకంగా వ్యవహరించారు.
  • 2013 సౌతాఫ్రికాలో పర్యటించిన భారత్ ఈసారి రెండు మ్యాచ్​ల సిరీస్ ఆడింది. ఇందులో ఒక మ్యాచ్​లో సౌతాఫ్రికా నెగ్గగా, మరో మ్యాచ్ డ్రా అయ్యింది. దీంతో 1-0 తేడాతో మళ్లీ సఫారీలు సిరీస్ గెలుచుకున్నారు.
  • ఐదేళ్ల తర్వాత 2018లో సఫారీ గడ్డపై భారత్- సౌతాఫ్రికా తలపడ్డాయి. మూడు మ్యాచ్​ల ఈ సిరీస్​ను సౌతాఫ్రికా 2-1తో గెలుచుకుంది.
  • ఇక చివరగా భారత్ 2021లో టెస్టు సిరీస్ ఆడింది. మూడు మ్యాచ్​ల ఈ సిరీస్​లో భారత్ తొలి మ్యాచ్​లోనే నెగ్గి లీడ్​లోకి వెళ్లింది. చివరి రెండు మ్యాచ్​ల్లో ఓడిన భారత్​కు మళ్లీ నిరాశే మిగిలింది.

టీమ్​ఇండియాకు షాక్- ఆ మ్యాచ్​లకు ఇషాన్, సూర్య దూరం- కారణాలివే

'మా కుర్రాళ్లకు ఇచ్చిన మెసేజ్‌ అదే- అందుకే సంజుకు అప్పట్లో ఛాన్సులు రాలేదు'

Last Updated : Dec 24, 2023, 11:55 AM IST

ABOUT THE AUTHOR

...view details