తెలంగాణ

telangana

ETV Bharat / sports

రెండో టెస్టుకు కోహ్లీ దూరం.. భిన్నంగా స్పందిస్తున్న నెటిజన్లు - విరాట్ కోహ్లీ నెటిజన్లు ట్వీట్

IND vs SA Test: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టుకు దూరమయ్యాడు టీమ్ఇండియా టెస్టు సారథి విరాట్ కోహ్లీ. ఇతడి స్థానంలో కేఎల్ రాహుల్.. జట్టుకు కెప్టెన్​గా వ్యవహరించనున్నాడు. అయితే కోహ్లీ అకస్మాత్తుగా మ్యాచ్​కు దూరమవడం పట్ల అతడి అభిమానులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో బీసీసీఐని విమర్శిస్తూ ట్వీట్లు చేస్తున్నారు.

Virat Kohli misses Johannesburg Test, విరాట్ కోహ్లీ రెండో టెస్టుకు దూరం
Virat Kohli

By

Published : Jan 3, 2022, 3:15 PM IST

IND vs SA Test: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టుకు ముందు కోహ్లీ ఫ్యాన్స్​కు ఓ నిర్ణయం షాక్​కు గురిచేసింది. ఈ మ్యాచ్​కు గాయం కారణంగా అతడు దూరమవడమే ఇందుకు కారణం. ఈ విషయాన్ని టాస్​ కోసం వచ్చిన తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ వెల్లడించాడు. వెన్నునొప్పి కారణంగా కోహ్లీ ఈ మ్యాచ్​కు దూరమయ్యాడని తెలిపాడు. అయితే విరాట్ అభిమానులు మాత్రం అందుకు ఒప్పుకోవట్లేదు. ఆదివారం ప్రాక్టీస్​లో కనిపించిన విరాట్​.. అకస్మాత్తుగా మ్యాచ్​కు ఎలా దూరమవుతాడని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో బీసీసీఐపై మండిపడుతున్నారు.

రాహుల్ రికార్డు

ఈ మ్యాచ్​ ద్వారా తాత్కాలిక కెప్టెన్​గా ఎంపికైన కేఎల్ రాహుల్​ ఓ రికార్డు నెలకొల్పాడు. భారత జట్టుకు టెస్టు కెప్టెన్​గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న 34వ క్రికెటర్​గా రికార్డు సృష్టించాడు. అలాగే ఈ బాధ్యతలు నిర్వర్తిస్తున్న నాలుగో కర్ణాటక ప్లేయర్ రాహుల్. ​

ఇవీ చూడండి: IND Vs SA Test: టీమ్​ఇండియాకు అదే బలం.. మూడేళ్లుగా గొప్ప రికార్డులు!

ABOUT THE AUTHOR

...view details