IND vs SA Test: దక్షిణాఫ్రికాతో కేప్‌టౌన్‌లో ఆరంభమయ్యే మూడో టెస్టుకు రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్ సాధిస్తే ఫామ్‌లో లేని ఆజింక్య రహానెను పక్కన పెట్టాలని టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. జొహానెస్‌బర్గ్‌లో జరిగిన రెండో టెస్టులో గాయం కారణంగా విరాట్ తప్పుకోవడం వల్ల కేఎల్ రాహుల్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించి.. విరాట్ స్థానంలో హనుమ విహారికి అవకాశం ఇచ్చారు.
మూడో టెస్టుకు కోహ్లీ తిరిగొస్తాడని భావిస్తున్న నేపథ్యంలో గౌతి మాట్లాడుతూ.. "చాలా రోజులుగా రహానె ఎలా ఆడుతున్నాడో అంతా చూస్తున్నారు. మూడో టెస్టుకు కోహ్లి వస్తే రహానెను తుది జట్టు నుంచి తప్పించాలి. విరాట్ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి.. రహానె స్థానంలో విహారిని అయిదో స్థానంలో ఆడించాలి. ఈ నిర్ణయం తీసుకోవడానికి ఇదే సరైన సమయం. ఎందుకంటే రహానెకు ఇలా అవకాశాలు ఇస్తూ పోతుంటే జట్టులో కుదురుకునేందుకు విహారికి మరింత సమయం పడుతుంది" గంభీర్ అన్నాడు.