తెలంగాణ

telangana

ETV Bharat / sports

అభిమానుల మనసులు గెలుచుకున్న రాహుల్! వీడియో చూశారా? - కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్

IND Vs SA Test Kl Rahul : దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్​లో టీమ్​ఇండియా వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ క్రీడాస్ఫూర్తిని చాటుకున్నాడు. తన చర్యతో అభిమానుల మనుసులు గెలుచుకున్నారు. అసలేం జరిగిందంటే?

IND Vs SA Test Kl Rahul
IND Vs SA Test Kl Rahul

By ETV Bharat Telugu Team

Published : Dec 28, 2023, 7:04 AM IST

IND Vs SA Test Kl Rahul :టీమ్​ఇండియా స్టార్ బ్యాటర్ కమ్ వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ మరోసారి తన అభిమానుల మనసులను గెలుచుకున్నాడు. దక్షిణాఫ్రికాతో సెంచూరియన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో సెంచరీతో భారత్​ను ఆదుకున్న రాహుల్​, ఫీల్డింగ్‌లోనూ సత్తా చాటుతున్నాడు. అయితే సౌతాఫ్రికా బ్యాటింగ్ సందర్భంగా వికెట్ కీపర్ రాహుల్ క్రీడా స్ఫూర్తిని చాటుకున్నాడు.

అసలేం జరిగిందంటే?
సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ 45వ ఓవర్‌లో ఈ సంఘటన జరిగింది. శార్దూల్ ఠాకూర్ వేసిన ఈ ఓవర్ రెండో బంతి డేవిడ్ బెడింగ్‌హమ్ బ్యాట్ ఎడ్జ్ తీసుకొని కీపర్ చేతిలో పడింది. అయితే ఈ క్యాచ్ పట్టుకుని అప్పీల్ చేశాడు రాహుల్. వెంటనే థర్డ్ అంపైర్ సమీక్ష కోరాలని ఫీల్డ్ అంపైర్‌కు సూచించాడు. క్యాచ్ విషయంలో క్లారిటీ లేకపోవడంతోనే ఈ సైగలు చేశాడు.

రాహుల్ సూచనలతో అంపైర్ రివ్యూ కోరాడు. రిప్లేలో బంతి కీపర్ గ్లోవ్స్‌లో పడే ముందు నేలకు తాకినట్లు కనిపించింది. దాంతో డేవిడ్ బెడింగ్‌ హమ్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. రాహుల్ నిజాయితీ కారణంగా అతడికి లైఫ్ లభించిందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఈ మ్యాచ్‌లో సఫారీ జట్టు భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా 66 ఓవర్లలో 5 వికెట్లకు 256 పరుగులు చేసింది. డీన్ ఎల్గర్(211 బంతుల్లో 23 ఫోర్లతో 140 బ్యాటింగ్) శతకంతో చెలరేగగా.. డేవిడ్ బెడింగ్‌హమ్(56) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఎల్గర్‌తో పాటు మార్కో జాన్సెన్(3 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా 11 పరుగుల ఆధిక్యంలో ఉంది. భారత బౌలర్లలో బుమ్రా, సిరాజ్ రెండేసి వికెట్లు తీయగా ప్రసిద్ధ్ కృష్ణ ఓ వికెట్ పడగొట్టాడు. బ్యాడ్ లైట్ కారణంగా నిర్ణీత సమయం కంటే ముందే అంపైర్లు ఆటను ముగించారు.

రాహుల్ ఫైటింగ్ సెంచరీ
అంతకు ముందు 208/8 ఓవర్ నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను కొనసాగించింది టీమ్​ఇండియా. కేఎల్ రాహుల్(137 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్స్‌లతో 101) మెరుపు శతకం పూర్తయిన తర్వాత తొలి ఇన్నింగ్స్‌ను 245 పరుగులకు ముగించింది. మహమ్మద్ సిరాజ్‌తో 9వ వికెట్‌కు 47 పరుగులు జోడించిన రాహుల్ చివరి వికెట్‌గా వెనుదిరిగాడు.

వేగంగా పరుగులు చేసి సిక్సర్‌తో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు రాహుల్. భారత బ్యాటర్లలో రాహుల్ తర్వాత విరాట్ కోహ్లీ(64 బంతుల్లో 5 ఫోర్లతో 38), శ్రేయస్ అయ్యర్(50 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 31), శార్దూల్ ఠాకూర్(33 బంతుల్లో 3 ఫోర్లతో 24) టాప్ స్కోరర్లుగా నిలిచారు. సౌతాఫ్రికా బౌలర్లలో కగిసో రబడా(5/59), నండ్రే బర్గర్(3/50)కు తోడుగా మార్కో జాన్సెన్, గెరాల్డ్ కోయిట్జీ తలో వికెట్ పడగొట్టాడు.

'రాహుల్​ ఇన్నింగ్స్​లో అవన్నీ ఉన్నాయి - అలా చేయడం అతడికే సాధ్యం'

అక్కడున్నది విరాట్​ కోహ్లీ మరి - దెబ్బకు రెండు వికెట్లు డౌన్​

ABOUT THE AUTHOR

...view details