తెలంగాణ

telangana

ETV Bharat / sports

Bumrah Injury: గాయంతో విలవిల.. మైదానాన్ని వీడిన బుమ్రా - భారత్-దక్షిణాఫ్రికా టెస్టు బుమ్రాకు గాయం

Bumrah Injury: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్ఇండియా స్టార్ పేసర్ బుమ్రాకు గాయమైంది. దీంతో అతడు వెంటనే మైదానాన్ని వీడాడు.

Bumrah injury, Bumrah latest news, బుమ్రా గాయం, బుమ్రా లేటెస్ట్ న్యూస్
Bumrah

By

Published : Dec 28, 2021, 6:34 PM IST

Updated : Dec 28, 2021, 7:19 PM IST

Bumrah Injury: టీమ్ఇండియాను మరోసారి గాయాల బెడద వణికిస్తోంది. ఇప్పటికే గాయం కారణంగా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్​కు దూరమయ్యాడు. తాజాగా సఫారీ జట్టుతో జరుగుతున్న తొలి టెస్టులో బౌలింగ్ చేస్తున్న సమయంలో పేసర్ బుమ్రా గాయపడ్డాడు. దీంతో వెంటనే అతడిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. అతడికి ఏం జరిగిందో అని ఒక్కసారిగా అభిమానులు ఆందోళనకు గురయ్యారు.

ఏం జరిగింది?

తొలి ఇన్నింగ్స్​లో బౌలింగ్ చేస్తున్న సమయంలో బుమ్రా కాలి మడిమ మెలితిరిగింది. దీంతో నొప్పితో విలవిలలాడాడీ పేసర్. టీమ్ఇండియా ఫిజియో నితిన్ పటేల్ బుమ్రా దగ్గరకు వచ్చి గాయాన్ని పరిశీలించాడు. అనంతరం బుమ్రా మైదానాన్ని వీడాడు. ప్రస్తుతం అతడు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడని బీసీసీఐ తెలిపింది.

బుమ్రా గాయం

పట్టుబిగిస్తున్న భారత్

ఈ మ్యాచ్​లో తొలి ఇన్నింగ్స్​లో 327 పరుగులకు ఆలౌటైంది టీమ్ఇండియా. అనంతరం బౌలర్లు ప్రొటీస్ బ్యాటర్లను ముప్పతిప్పలు పెడుతున్నారు. తొలి ఓవర్లోనే కెప్టెన్ ఎల్గర్​ (1)ను బుమ్రా పెవిలియన్ పంపాడు. అనంతరం మర్క్​రమ్ (13), పీటర్సెన్ (15)ను షమీ బోల్తా కొట్టించాడు. ఇక వాండర్ డస్సేన్​ను సిరాజ్​ ఔట్ చేశాడు. దీంతో 32 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది సఫారీ జట్టు. కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్న డికాక్​ (34)ను శార్దూల్ వెనక్కి పంపాడు. ప్రస్తుతం బవుమా, ముల్దర్ క్రీజులో ఉన్నారు.

ఇవీ చూడండి: Ashes 2021 Records: ఇంగ్లాండ్​పై ఆసీస్ విజయం.. రికార్డులే రికార్డులు!

Last Updated : Dec 28, 2021, 7:19 PM IST

ABOUT THE AUTHOR

...view details