IND vs SA Test: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమ్‌ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఫీట్ నమోదు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా ఆటగాడు కీగన్ పీటర్సన్‌ను ఔట్ చేయడం ద్వారా మాజీ స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే తర్వాత వాండరర్స్ మైదానంలో వికెట్ తీసిన రెండో భారత స్పిన్నర్‌గా నిలిచాడు.
2006-07 దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా.. వాండరర్స్‌లో జరిగిన తొలి టెస్టులో అనిల్ కుంబ్లే (2/2, 3/54) ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. దీంతో టీమ్‌ఇండియా ఆ టెస్టులో 123 పరుగుల తేడాతో సఫారీలపై విజయం సాధించింది. అప్పటి నుంచి టీమ్‌ఇండియా రెండు సార్లు (2013-14, 2017-18) దక్షిణాఫ్రికాలో పర్యటించింది. అయినా ఒక్క స్పిన్నర్ కూడా వికెట్ తీయలేకపోయాడు. తాజా పర్యటనలో భాగంగా వాండరర్స్ మైదానంలో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. కీగన్ పీటర్సన్‌ను ఔట్ చేశాడు. దీంతో అనిల్ కుంబ్లే తర్వాత వాండరర్స్‌లో వికెట్ తీసిన భారత స్పిన్నర్‌గా అశ్విన్ అరుదైన ఫీట్ సాధించాడు.
ఇదీ చదవండి: