IND vs SA Test: భారత్-దక్షిణాఫ్రికా మధ్య రెండో టెస్టు జోహన్నస్బర్గ్ వేదికగా జరుగుతోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది భారత్. అయితే టీమ్ఇండియా బ్యాటర్లు తడబడ్డారు. ఓపెనర్లు మయాంక్ (26), రాహుల్ (50) కాస్త పోరాడినా.. పుజారా (3), రహానే (0) దారుణంగా విఫలమయ్యారు. అయితే ఇప్పుడు పుజారా ఔటైన స్కోర్ నెట్టింట విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ఎందుకో తెలుసా?
IND vs SA Test: 3 పరుగులకు పుజారా ఔట్.. ఇది గమనించారా?
IND vs SA Test: భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఓ వింత చోటు చేసుకుంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో టీమ్ఇండియా సీనియర్ బ్యాటర్ పుజారా 33 బంతుల్లో 3 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే ఇక్కడ ఓ విశేషం ఉంది. అదేంటంటే?
Pujara
ఇదీ సంగతి
తొలి ఇన్నింగ్స్లో పుజారా 33 బంతులాడి కేవలం 3 పరుగులు చేసి ఔటయ్యాడు. పుజారా వయసు 33. అలాగే సోమవారం మూడో మిలీనియమ్లోని మూడో దశాబ్దంలోని మూడో ఏడాదిలోని మూడో రోజు. దీంతో ఇప్పుడు ఈ మ్యాజిక్ నెంబర్స్ విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. "మూడో మిలీనియమ్లోని మూడో దశాబ్దంలోని మూడో ఏడాదిలో మూడో రోజు 33 ఏళ్ల పుజారా 33 బంతుల్లో 3 పరుగులు చేశాడు" అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.