IND vs SA Test: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్ పట్టు సాధించే అవకాశాన్ని చేజార్చుకుంటోంది. సఫారీ బౌలర్లు విజృంభించడం వల్ల స్వల్ప వ్యవధిలో నాలుగు వికెట్లను కోల్పోయిన టీమ్‌ఇండియా కష్టాల్లో పడింది. మూడో రోజు లంచ్ బ్రేక్ సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో భారత్ ఆరు వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. క్రీజ్‌లో హనుమ విహారి (6*), శార్దూల్ (4*) ఉన్నారు. ప్రస్తుతం 161 పరుగుల ఆధిక్యంతో భారత్ కొనసాగుతోంది. కనీసం ఇంకో వంద పరుగులైనా చేస్తేనే విజయం కోసం భారత్ పోరాటం సాగించే అవకాశాలు ఉంటాయి.
IND vs SA Test: ఆధిక్యం కోసం భారత్ పోరాటం.. పుజారా, రహానే అర్ధశతకాలు - భారత్-దక్షిణాఫ్రికా రెండో టెస్టు స్కోర్ కార్డ్
IND vs SA Test: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో పట్టు సాధించే అవకాశాన్ని కోల్పోతోంది టీమ్ఇండియా. రెండో ఇన్నింగ్స్‌లో రహానే, పుజారా అర్ధశతకాలతో రాణించినా.. మిగతా బ్యాటర్ల నుంచి మద్దతు కరవైంది. దీంతో మూడో రోజు లంచ్ సమయానికి భారత జట్టు 6 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది.
పుజారా, రహానే పోరాటం
ఓవర్‌నైట్ స్కోరు 85/2తో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్‌కు మంచి ఆరంభమే దక్కింది. పుజారా (53), రహానె (58) మంచి లయతో పరుగులు రాబట్టారు. కోల్పోయిన ఫామ్‌ను అందుకుని ఇద్దరూ అర్ధశతకాలు నమోదు చేసుకున్నారు. వీరద్దరూ కలిసి 111 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. అయితే స్వల్ప వ్యవధిలో పుజారా, రహానెతోపాటు రిషభ్ పంత్ (0) పెవిలియన్‌కు చేరడం వల్ల టీమ్‌ఇండియా కష్టాల్లో పడింది. అయితే కాస్త దూకుడుగా ఆడిన అశ్విన్ (16) లంచ్ బ్రేక్‌కు ముందు పెవిలియన్‌కు చేరాడు. తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన శార్దూల్, హనుమ విహారి మరో వికెట్ పడనీయకుండా మొదటి సెషన్‌ను ముగించారు. సఫారీ బౌలర్లలో కగిసో రబాడ 4.. ఒలివీర్, జాన్సెన్ చెరో వికెట్ తీశారు.