తెలంగాణ

telangana

ETV Bharat / sports

రెండో టీ20లోనూ సఫారీలదే విజయం.. విజృంభించిన క్లాసెన్ - south africa series

కటక్​ వేదికగా జరిగిన రెండో టీ20లో టీమ్​ఇండియాపై దక్షిణాఫ్రికా జట్టు విజయం సాధించింది. వికెట్​ కీపర్​ బ్యాట్స్​మెన్​ క్లాసెన్​ 46 బంతుల్లో 81 పరుగులు బాది జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

d
d

By

Published : Jun 12, 2022, 10:31 PM IST

Updated : Jun 12, 2022, 11:02 PM IST

తొలి టీ20 ఓటమి నేపథ్యంలో రెండో మ్యాచ్​తోనైనా తిరిగి ఫామ్​లోకి రావాలనుకున్న టీమ్​ఇండియాకు నిరాశే మిగిలింది. సఫారీలు మరోసారి విజృంభించారు. అటు బ్యాటింగ్​.. ఇటు బౌలింగ్​తో చెలరేగారు. ఫలితంగా టీమ్​ఇండియాపై నాలుగు వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా జట్టు విజయం సాధించింది. వికెట్​ కీపర్​ బ్యాట్స్​మెన్​ క్లాసెన్​ 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 46 బంతుల్లోనే 81 పరుగులు బాది జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తెంబా బవుమా (35; 30 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు.

అంతకుముందు.. టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన భారత్​ సఫారీల బౌలింగ్​కు తడబడింది. ఓపెనర్​ రుజురాజ్​ గైక్వాడ్​ ఒక్క పరుగు చేసి వెనుతిరగగా.. ఇషాన్​ కిషన్​ 21 బంతుల్లో 34 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. శ్రేయస్​ అయ్యర్ 40(35), దినేశ్​ కార్తిక్​ 30*(21) మినహా ఇతర ఆటగాళ్లు చాలా స్వల్ప స్కోరు చేసి వెనుదిరిగారు. దీంతో 20 ఓవర్లకు 6 వికెట్ల నష్టానికి టీమ్​ఇండియా 148 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్లలో భువనేశ్వర్‌ కుమార్‌ మూడు ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 13 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. హర్షల్‌ పటేల్, చాహల్‌ తలో వికెట్ తీశారు. ఈ విజయంతో సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి దక్షిణాఫ్రికా దూసుకెళ్లింది. వైజాగ్‌ వేదికగా మంగళవారం (జూన్‌ 14) మూడో టీ20 జరగనుంది.

ఇదీ చూడండి :'భారత్​పై ఆ ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. నేను ఉండుంటే..'

Last Updated : Jun 12, 2022, 11:02 PM IST

ABOUT THE AUTHOR

...view details