IND vs SA Series: ఇటీవలే టీమ్ఇండియా టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించి మొదటి సిరీస్‌లోనే సారథిగా ఆకట్టుకున్నాడు రోహిత్ శర్మ. ఇప్పుడు టెస్టు వైస్ కెప్టెన్‌గానూ ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. త్వరలో భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్‌లోని టెస్టు సిరీస్‌కు హిట్‌మ్యాన్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేస్తారని తెలుస్తోంది.
IND vs SA Series: రోహిత్‌కు టెస్టు వైస్ కెప్టెన్సీ పగ్గాలు! - భారత్-దక్షిణాఫ్రికా టూర్
IND vs SA Series: త్వరలో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది టీమ్ఇండియా. ఈ పర్యటనలో టెస్టు సిరీస్‌కు రోహిత్ శర్మను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేయాలని భావిస్తోందట బీసీసీఐ. కొంతకాలంగా రహానే దారుణంగా విఫలమవుతుండటం వల్ల ఇతడి స్థానంలో రోహిత్‌కు డిప్యూటీ హోదా ఇవ్వాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
![IND vs SA Series: రోహిత్‌కు టెస్టు వైస్ కెప్టెన్సీ పగ్గాలు! Rohit Sharma voice captaincy, Rohit Sharma latest news, రోహిత్ శర్మ లేటెస్ట్ న్యూస్, రోహిత్ శర్మ వైస్ కెప్టెన్సీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13812841-726-13812841-1638592256279.jpg)
Rohit Sharma Captaincy: టీమ్ఇండియా సీనియర్ క్రికెటర్ అజింక్యా రహానే కొంతకాలంగా బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమవుతున్నాడు. గతేడాది మెల్బోర్న్లో సెంచరీ మినహా ఇప్పటివరకు చెప్పుకోదగిన ఒక్క ఇన్నింగ్స్ కూడా ఆడలేకపోయాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 39 పరుగులు మాత్రమే చేశాడు. గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమయ్యాడు. అయితే రహానేకు గాయమని చెప్పి బీసీసీఐ ఇతడిని గౌరవంగా తప్పించిందని అందరూ అంటున్నారు. ఈ నేపథ్యంలోనే దక్షిణాఫ్రికా పర్యటనకూ ఇతడు ఎంపికయ్యేది అనుమానంగా మారింది. దీంతో రోహిత్‌కు వైస్ కెప్టెన్సీ ఇవ్వడం దాదాపు ఖాయమే.
ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ కలకలం సృష్టిస్తున్న దృష్ట్యా భారత్‌తో సిరీస్ అనుమానంగా మారింది. కానీ బీసీసీఐ మాత్రం అక్కడికి వెళ్లేందుకు సుముఖత వ్యక్తం చేస్తోంది. కాకపోతే సిరీస్‌ను ఒక వారం వాయిదా వేయాలని కోరుతోంది. న్యూజిలాండ్‌తో రెండో టెస్టు ముగిశాక సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది టీమ్ఇండియా. అందుకోసం త్వరలోనే జట్టును ప్రకటించనున్నారు. టీ20 సిరీస్‌కు రోహిత్ కెప్టెన్‌గా చేయనుండగా, వన్డేల్లోనూ హిట్‌మ్యాన్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించాలని చూస్తోంది బీసీసీఐ.