తెలంగాణ

telangana

ETV Bharat / sports

IND vs SA Series: సఫారీ గడ్డపై అదరగొట్టిన భారత బ్యాటర్లు వీరే! - దక్షిణాఫ్రికాలో రహానే రన్స్

త్వరలోనే దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది టీమ్ఇండియా. ఈ నేపథ్యంలో అక్కడి పిచ్​లపై గత పదేళ్లలో ఎక్కువ పరుగులు సాధించిన భారత ఆటగాళ్లు ఎవరో చూద్దాం.

dhawan in south africa
ధావన్

By

Published : Dec 14, 2021, 12:44 PM IST

IND vs SA Series:మరో రెండు రోజుల్లో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది టీమ్ఇండియా. కొంతకాలంగా విదేశాల్లో సత్తాచాటుతున్న భారత ఆటగాళ్లు సౌతాఫ్రికా పిచ్​లపై మాత్రం తేలిపోతున్నారు. ఇదే గడ్డపై 2007లో జరిగిన తొలి టీ20 ప్రపంచకప్​లో విజేతగా నిలిచింది టీమ్ఇండియా. కానీ ద్వైపాక్షిక సిరీస్​లో మాత్రం రాణించలేకపోతుంది. ఈ పిచ్​లపై అదరగొట్టాలని కొంతకాలంగా మన ఆటగాళ్లు ప్రయత్నిస్తున్నా అది సాధ్యపడట్లేదు. కానీ కొందరు మాత్రం ఆశాజనకమైన ప్రదర్శన చేశారు. ఈ నేపథ్యంలో 2011 నుంచి సఫారీ గడ్డపై ఎక్కువ పరుగులు చేసిన భారత క్రికెటర్లెవరో చూద్దాం.

విరాట్ కోహ్లీ

కోహ్లీ

దక్షిణాఫ్రికా పిచ్​లపై విరాట్ కోహ్లీకి మంచి రికార్డుంది. ఇతడు అక్కడ 26 ఇన్నింగ్స్​లు ఆడి 1395 పరుగులు సాధించాడు. ఈ పదేళ్లలో సౌతాఫ్రికా పిచ్​లపై ఓ భారత బ్యాటర్ చేసిన అత్యధిక పరుగులు ఇవే. అలాగే సగటు 63.40, స్ట్రైక్ రేట్ 75.36గా ఉంది. ఇందులో 5 సెంచరీలు, 5 అర్ధశతకాలు ఉండటం గమనార్హం.

శిఖర్ ధావన్

ధావన్

బౌన్సీ పిచ్​లపై అదరొడుతుంటాడు టీమ్ఇండియా ఓపెనర్ శిఖర్ ధావన్. అలాగే సౌతాఫ్రికాలోనూ మంచి ప్రదర్శన చేశాడు. ఇతడు ఈ దేశ పర్యటనలో 17 ఇన్నింగ్స్​లు ఆడి 586 పరుగులు చేశాడు. సగటు 36.62 కాగా స్ట్రైక్ రేట్ 92.28గా ఉంది. ఇందులో 3 అర్ధశతకాలు, ఒక శతకం ఉన్నాయి.

రోహిత్ శర్మ

రోహిత్

ప్రస్తుత టీమ్ఇండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ సౌతాఫ్రికా గడ్డపై అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. ఇతడు అక్కడ ఆడిన 25 ఇన్నింగ్స్​ల్లో 464 పరుగులు సాధించాడు. సగటు 18.56గా ఉంది. ఇందులో ఒక అర్ధసెంచరీ, ఒక శతకం ఉన్నాయి.

అజింక్యా రహానే

రహానే

సౌతాఫ్రికా సిరీస్​ కంటే ముందు టెస్టు వైస్ కెప్టెన్సీ నుంచి ఇతడిని తప్పించింది బీసీసీఐ. ఇక్కడి పిచ్​లపై రహానే ప్రదర్శన కూడా అంతంతమాత్రమే ఉంది. పదేళ్లలో ఇతడు అక్కడ 12 ఇన్నింగ్స్​ల్లో బ్యాటింగ్ చేసి 41.40 సగటుతో 414 పరుగులు చేశాడు. ఇందులో 3 అర్ధసెంచరీలు ఉన్నాయి.

ధోనీ

ధోనీ

దక్షిణాఫ్రికాలోనే జరిగిన టీ20 ప్రపంచకప్-2007లో జట్టును విజేతేగా నిలిపాడు ధోనీ. కాగా, ఇక్కడి పిచ్​లపై 20 ఇన్నింగ్స్​ల్లో 72.06 స్ట్రైక్ రేట్​తో 405 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధశతకాలు కూడా ఉన్నాయి.

ఇవీ చూడండి: IND vs SA Series: వన్డే సిరీస్​కు కోహ్లీ దూరం.. ఫ్యాన్స్​లో అనుమానాలు!

ABOUT THE AUTHOR

...view details