IND vs SA Series: న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో విజయం సాధించిన టీమ్ఇండియాకు కాస్త విరామం దొరికింది. అయితే త్వరలోనే భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఆ దేశంలో డిసెంబర్ 26న జరగబోయే తొలి టెస్టుతో పర్యటన ప్రారంభం కానుంది. ఇందుకోసం భారత ఆటగాళ్లు ఈ నెల 16న సౌతాఫ్రికాకు బయలుదేరనున్నట్లు తెలుస్తోంది. అంతకుముందే ఆదివారం ముంబయి చేరుకుని క్వారంటైన్లో ఉండనున్నారు. ఆ తర్వాత సౌతాఫ్రికా వెళ్లి బయోబబుల్‌లోకి ప్రవేశిస్తారు. టెస్టు సిరీస్ ముగిసేవరకు వారు బబుల్‌లోనే ఉండనున్నారు.
IND vs SA Series: టీమ్ఇండియా దక్షిణాఫ్రికా ప్రయాణం అప్పుడే! - డిసెంబర్ 16న దక్షిణాఫ్రికాకు టీమ్ఇండియా
IND vs SA Series: న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ ముగిశాక టీమ్ఇండియా ఆటగాళ్లకు కాస్త విరామం దొరికింది. దీంతో వారి ఫ్యామిలీతో సరదాగా గడుపుతున్నారు. అయితే త్వరలోనే దక్షిణాఫ్రికాతో సిరీస్ జరగనుంది. ఇందుకోసం టీమ్ఇండియా ఈనెల 16న సౌతాఫ్రికాకు బయలుదేరనుందని తెలుస్తోంది.
IND vs SA Series
ఈ టెస్టు సిరీస్ కోసం 18 మందితో కూడిన జట్టును ఇప్పటికే ప్రకటించింది టీమ్ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ. వన్డే సిరీస్ కోసం రెండు, మూడు రోజుల్లో జట్టును ప్రకటించనున్నారు. డిసెంబర్ 26న సెంచూరియన్ వేదికగా తొలి టెస్టు జరగనుంది. జనవరి 3-7 వరకు రెండో టెస్టు, 11-15 వరకు మూడో టెస్టు నిర్వహించనున్నారు. అనంతరం మూడు వన్డేల సిరీస్‌లో తలపడతాయి ఇరుజట్లు.
ఇవీ చూడండి: మారియా కిరిలెంకో.. ఈ టెన్నిస్ భామ చాలా హాట్ గురూ!