Vengsarkar about Ruturaj: దక్షిణాఫ్రికా పర్యటన కోసం త్వరలో ఎంపిక చేయనున్న వన్డే జట్టులో.. యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్‌కు తప్పనిసరిగా చోటివ్వాలని మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్ సర్కార్ సూచించాడు. ఇప్పుడు అతడి వయసు 24 ఏళ్లని.. ఈ సమయంలోనే అతడిని టీమ్ఇండియాకు ఎంపిక చేస్తే బాగుంటుందని తెలిపాడు.
IND vs SA Series : 'రుతురాజ్‌కు అవకాశం.. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు' - రుతురాజ్ గైక్వాడ్ దక్షిణాఫ్రికా పర్యటన
Vengsarkar about Ruturaj: దక్షిణాఫ్రికాతో జరగబోయే వన్డే సిరీస్ కోసం ఎంపిక చేసే జట్టులో యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్‌కు తప్పకుండా చోటివ్వాలని సూచించాడు మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్ సర్కార్. ప్రస్తుతం అతడు విజయ్ హజారే ట్రోఫీలో అదరగొడుతున్నాడని గుర్తు చేశాడు.
![IND vs SA Series : 'రుతురాజ్‌కు అవకాశం.. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు' ruturaj gaikwad latest news, Vengsarkar about Ruturaj, రుతురాజ్ గైక్వాడ్ లేటెస్ట్ న్యూస్, దిలీప్ వెంగ్‌సర్కార్ రుతురాజ్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13900215-1019-13900215-1639455448701.jpg)
"రుతురాజ్ ప్రస్తుతం అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో శతకాల మోత మోగిస్తున్నాడు. అతడిని నేరుగా దక్షిణాఫ్రికా పర్యటనకు పంపించవచ్చు. మూడో స్థానంలో కూడా అతడు అద్భుతంగా రాణించగలడు. అందుకే, అతడికి దక్షిణాఫ్రికాతో జరుగనున్న వన్డే సిరీస్‌లో కచ్చితంగా అవకాశం ఇవ్వాలి. అతడేం 18 ఏళ్ల పిల్లవాడు కాదు. ప్రస్తుతం అతడి వయసు 24 ఏళ్లు. 28 ఏళ్ల వయసులో టీమ్‌ఇండియాకు ఎంపిక చేయడంలో అర్థం లేదు" అని దిలీప్ వెంగ్‌సర్కార్ పేర్కొన్నాడు.
ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హాజారే ట్రోఫీలో మహారాష్ట్ర జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రుతురాజ్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. దాంతో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టు తరఫున ఆడుతున్న అతడు గత సీజన్‌లో అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు.